Saindhav: సైకోకి సలామ్ కొట్టాల్సిందేనా..? సైంధవ్ మెప్పిస్తుందా..?
సైకో వెంకీ.. గణేష్‌ని, తులసిని మించిపోయాడు. పాత్రలో పాతుకుపోయాడు. శైలేష్ కొలను క్యారెక్టరైజేషన్‌కి వెంకీ ప్రజెంటైషన్ తోడైంది. ఇక విలన్‌గా బాలీవుడ్ టాప్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దీఖీ పెర్ఫామెన్స్ పీక్స్ అనేస్తున్నారు.
Saindhav: విక్టరీ వెంకేటేష్ తులసి, గణేష్ మూవీల్లోలా పూనకాలు తెప్పించే మాస్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేసి ఏళ్లవుతోంది. అలాంటిది తన 75వ మూవీతో తనో సైకోగా మారి సైంధవ్‌గా బాక్సాఫీస్ మీద దండెత్తితే.. ఫ్యాన్స్‌లో పూనకాలే. అదే విషయం ట్రైలర్‌తో తేలింది. థియేటర్స్‌లో ఇప్పుడు సినిమా వంతొచ్చింది. కథ విషయానికొస్తే సైంధవ్‌లో హీరో కి సైకోగా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాని అవన్నీ పక్కన పెట్టి తన కుటుంబంతో హాయిగా గడుపుతుండాడు.
GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేశ్‌ను ముంచిన త్రివిక్రమ్..
కాని తన కూతురుకి సడన్‌గా నరాలకు సంబంధించిన జబ్బు రావటం, దానిక 17 కోట్ల విలువ చేసే ఇంజెక్షనే ట్రీట్మెంట్ కి అవసరమవుతుంది.. దీంతో చేసేది లేక హీరో మళ్లీ తన ఫ్లాష్ బ్యాక్ లో నడిచిన మార్గంలో సైకోగా మారటం జరుగుతుంది. ఐతే అదే సమయంలో తనని విలన్ బ్యాచ్ ఎలా అడ్డుకుంది. అందుకు సైకో ఏం చేశాడనేదే కథ. సైకో వెంకీ.. గణేష్‌ని, తులసిని మించిపోయాడు. పాత్రలో పాతుకుపోయాడు. శైలేష్ కొలను క్యారెక్టరైజేషన్‌కి వెంకీ ప్రజెంటైషన్ తోడైంది. ఇక విలన్‌గా బాలీవుడ్ టాప్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దీఖీ పెర్ఫామెన్స్ పీక్స్ అనేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు పాట ఇతర నటులు పాత్ర పరిధిమేరకు పర్లేదనిపించారు.
ఇక మేకింగ్ విషయానికొస్తే శైలేష్.. హిట్ 1, హిట్ 2 లానే ఈ సినిమాలో అటు ఫ్యామిలీ డ్రామా, ఇటు యాక్షన్ థ్రిల్లర్ ఫ్లేవర్స్ మిక్స్ చేశాడు. యాక్షన్ డ్రామాగా ఫైనల్ ఔట్‌పుట్‌తో షాక్ ఇచ్చాడు. సైంధవ్‌కి సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిస్తే, లాస్ట్ 20 మినట్స్ నిజంగానే మాస్ మతిపోగొట్టేశాడు వెంకీ. ఓవారాల్‌గా శైలేష్‌కి ఈ సినిమాతో హ్యాట్రిక్, వెంకికీ 75వ మూవీగా హిట్ మెట్టెక్కే ఛాన్స్ వచ్చేశాయి.