Saindhav Review: హిట్ పడినట్టేనా.. ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో వెంకీ మామ

డెక్టర్ శైలేష్ కొలను రాసిన స్టోరీ పాయింట్ బాగున్నా.. టేకింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా వెళుతుంది. స్టోరీలోకి వెళ్లడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది కానీ ఎక్కడ గ్రిప్పింగ్‌గా అనిపించదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 13, 2024 | 04:13 PMLast Updated on: Jan 13, 2024 | 5:15 PM

Saindhav Telugu Movie Review Actor Victory Venkatesh And Nawazuddin Siddique Steals The Show

Saindhav Review: విక్టరీ వెంకటేష్‌-శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సైంధవ్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలిచిన 75వ చిత్రంతో హిట్ అందుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
స్టోరీ లైన్..
సైంధవ్ కొలను తన కూతురితో కలిసి ఉంటాడు. సైంధవ్ కి గతం ఉంటుంది. దానికి దూరంగా ప్రస్తుతం అసలు దానికి సంబంధమే లేకుండా బతుకుతాడు. ఒక సమయంలో తన కూతురు గాయత్రి పాప కి ఆరోగ్యం పాడవుతుంది. ఆ అమ్మాయి కోసం 17 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు సైంధవ్ ఏం చేశాడు? అసలు సైంధవ్ గతం ఏంటి? తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు? అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటినటుల పర్పామెన్స్..
విక్టరీ వెంకటేష్ ఎక్స్‌లెంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ మోడ్‌లో అదరగొట్టేశాడు. వెంకటేష్ ఈ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు. బేబీ సారా మొదటి సినిమా అయినప్పటికి చక్కగా నటించి మెప్పించింది. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తన పాత్ర మేరకు బాగానే నటించింది. మరొక ముఖ్య పాత్రలో నటించిన రుహానీ శర్మ, కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఆండ్రియా కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ బాగా నటించడంతో పాటు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ముఖేష్ రిషి తెలుగు సినిమాల్లో రెగ్యులర్‌గా పోషించే విలన్ పాత్రలోనే కనిపించారు. జిష్షు సేన్‌గుప్తా పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
టెక్నికల్ అంశాలు
డెక్టర్ శైలేష్ కొలను రాసిన స్టోరీ పాయింట్ బాగున్నా.. టేకింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా వెళుతుంది. స్టోరీలోకి వెళ్లడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది కానీ ఎక్కడ గ్రిప్పింగ్‌గా అనిపించదు. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. చాలా స్టైలిష్ గా అనిపించింది.సంతోష్ నారాయణన్ అందించడం పాటలు అంత గొప్పగా ఏమీ అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్నిచోట్ల బాగుంది. ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ కొన్ని చోట్ల కరెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రం ఇంకా కాస్త క్రిస్ప్‌గా ఎడిట్ చేస్తే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా అప్పుడేప్పుడు ఘర్షణలో వెంకీ మామను యాక్షన్ మోడ్ లో చూసిన ఫ్యాన్స్‌కి ఇన్నాళ్లుకు అలాంటి రోల్‌లో సైందవ్‌లో కనించాడు. ఎమోషనల్ టచ్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.