Sakshi Vaidya: మెగా హీరోలను టార్గెట్ చేసిన యంగ్ హీరోయిన్..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ వేరు. అరడజను మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ.. హిట్లు, ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.

ఒక్కసారి మెగా కాపౌండ్ హీరోలతో సినిమా పడితే చాలు.. వరుస ఆఫర్లు వచ్చేస్తాయి అనుకుంటారు చాలా మంది హీరోయిన్లు. రీసెంట్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన యంగ్ బ్యూటీ సాక్షి వైద్య కూడా ఇప్పుడు మెగా కాంపౌండ్‌పై కన్నేసింది. వరుస బెట్టి మెగా హీరోలతో సినిమాలు చేస్తోంది. ఏజెంట్ సినిమాతో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ ఆ సినిమాతో ఓ పెద్ద డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా ఫ్లాపైనా సాక్షి యాక్టింగ్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో అమ్మడుకు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాంఢీవధారి అర్జున సినిమాలో సాక్షి హీరోయిన్‌గా చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న మరో సినిమాలో కూడా సాక్షిని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాన్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో శ్రీలీలతో పాటు సాక్షి వైద్యను కూడా తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా.. లేక మరో లీడ్ రోల్ కోసం సాక్షిని సెలెక్ట్ చేశారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్‌లో సాక్షి ఎంట్రీ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది. ఇలా వరుసగా మూడు ప్రాజెక్ట్‌లు మెగా హీరోలతోనే చేస్తూ కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది ఈ బ్యూటీ.