Salaar: సలార్‌ టీజర్‌ మీద ఫ్యాన్స్ అసంతృప్తి.. అసలు కారణం ఇదే..!

టీజర్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మార్క్‌ పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఐతే టీజర్ మీద ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. డైలాగ్‌లు పవర్‌పుల్‌గానే ఉన్నా.. ఒక్కటి తక్కువయింది అంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 6, 2023 | 11:57 AMLast Updated on: Jul 06, 2023 | 11:57 AM

Salaa Teaser Released Prabhas Gangster Drama Is A Treat For Action Lovers But Fans Get Angry Why

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్ మూవీ టీజర్ వచ్చింది. మూవీ రెండు భాగాలు అని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్. టీజర్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మార్క్‌ పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఐతే టీజర్ మీద ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. డైలాగ్‌లు పవర్‌పుల్‌గానే ఉన్నా.. ఒక్కటి తక్కువయింది అంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. టీజర్‌లో చెప్పిన డైలాగ్‌ పవర్‌ఫుల్‌గానే ఉంది.

అది ప్రభాస్ గురించే కానీ.. ఆ డైలాగ్‌ ప్రభాస్ చెప్పలేదని కొందరు అసంతృప్తితో కనిపిస్తుంటే.. అన్నీ ఉన్నాయ్ సరే ప్రభాస్ ఎక్కడ.. ఎందుకు లుక్ రివీల్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్న ఫ్యాన్స్ మరికొందరు. టీజర్‌ లాస్ట్‌ ఫ్రేమ్‌లో ప్రభాస్‌ను చూపించారు. అయితే, పృధ్వీరాజ్‌ను చూపించినంత క్లియర్‌గా కూడా ప్రభాస్‌ను చూపించలేకపోయారు ఎందుకు అంటూ ఫ్యాన్స్ ఊసూరుమంటున్నారు. ఎంతో ఆశగా, అంచనాలతో ఎదురుచూస్తే.. ప్రభాస్‌ను పూర్తిగా చూపించ‌కుండా ఇలా చూపించారేంటి అని డైరెక్టర్ మీద ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. యాంటీ ఫ్యాన్స్‌, నెటిజన్లు మాత్రమే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ నీల్‌ను ఆడేసుకుంటున్నారు. ఇంత పొద్దున లేచింది ఆ ముసలోడిని చూసేందుకా అని మరికొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ మోసం చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో స‌లార్ టీజ‌ర్ నెంబ‌ర్ వ‌న్‌గా ట్రెండ్ అవుతోంది. టీజ‌ర్‌తో స‌లార్ రెండు భాగాలుగా ఉండబోతోందని.. మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చేశారు. స‌లార్ రెండో భాగం షూటింగ్ ఎప్పటినుంచి ఉంటుంద‌నేది ఇప్పుడైతే నిర్మాత‌లు చెప్పలేదు. పార్ట్ 1 రిలీజైన త‌ర్వాతే సెకండ్ పార్ట్ గురించి ఆలోచ‌న చేస్తార‌న‌టంలో అనుమానం లేదు. అలాగే ఈ సినిమాకు KGFకు లింకు ఉంద‌నే వార్తలు కూడా వైర‌ల్ అవుతున్నాయ్. అందులో నిజం ఎంతో తెలియాలంటే.. సెప్టెంబర్‌ 28వరకు ఎదురుచూడాల్సిందే. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆరోజు వాల్డ్‌వైడ్‌గా మూవీ రిలీజ్ కాబోతోంది.