SALAAR: ప్రభాస్ ప్లాన్ చేంజ్.. సలార్ 2 తర్వాతే మారుతి మూవీ

ఇంత అర్జెంట్‌గా ఈ సీక్వెల్ ప్లాన్ చేయటానికి ఒక కారణం ఎన్టీఆర్. మరో కారణం ఊపున్నప్పుడే సినిమా తీయాలని దర్శకుడు అనుకోవటం. నిజానికి కల్కి మూవీని ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలనేది నాగ్ అశ్విన్ ప్లానింగ్. ఆ తర్వాత ప్రభాస్ ఫ్రీ అవుతాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 06:11 PMLast Updated on: Feb 13, 2024 | 6:11 PM

Salaar 2 Shooting Will Commence Soon Before The Raja Saab

SALAAR: రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ 2 ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెడీ అయిపోతున్నాడు ప్రశాంత్ నీల్. కథ కూడా లాక్ అయ్యిందట. ఇంత అర్జెంట్‌గా ఈ సీక్వెల్ ప్లాన్ చేయటానికి ఒక కారణం ఎన్టీఆర్. మరో కారణం ఊపున్నప్పుడే సినిమా తీయాలని దర్శకుడు అనుకోవటం. నిజానికి కల్కి మూవీని ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలనేది నాగ్ అశ్విన్ ప్లానింగ్. ఆ తర్వాత ప్రభాస్ ఫ్రీ అవుతాడు కాబట్టి మారుతి మేకింగ్‌లో ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ మొదలవ్వొచ్చన్నారు.

Chiranjeevi: మాస్ రచ్చ.. నెక్ట్స్ లెవల్‌లో పోరాట సన్నివేశాలు..!

40 శాతం షూటింగ్ పూర్తైన ఈ మూవీ ఇక పట్టాలెక్కుతుందనుకుంటే, సడన్‌గా సలార్ 2 ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్.. సలార్‌ని మొదలు పెట్టినప్పుడే, సలార్ 2 ని కూడా ప్లాన్ చేశాడు. కథ కూడా రఫ్‌గా రెడీ చేశాడు. ఇక ఎన్టీఆర్‌తో మూవీ తీశాకే సలార్ 2 ప్లాన్ చేయాలనుకున్నాడు. కాని తారక్.. దేవర మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఫలితంగా వార్ 2 కూడా డిలే అవుతుంది. మొత్తంగా మరో ఏడాది వరకు ప్రశాంత్ నీల్‌కి తారక్ అందుబాటులో ఉండటం కష్టమే. కాబట్టే ఈ లోపు సలార్ 2ని తీసేందుకు రంగం సిద్దం చేశాడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ రెడీగా ఉన్న సలార్ 2 రఫ్ స్క్రిప్ట్‌ని డెవలప్‌ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

ఎట్టిపరిస్థితుల్లో మే ఎండ్ లేదంటే జూన్ నుంచి షూటింగ్ షురూ చేయాలనుకుంటున్నాడట. అదే జరిగితే, కల్కి తర్వాత మారుతి మూవీ రాజా సాబ్‌కి డేట్లు కేటాయించాల్సిన ప్రభాస్ సలార్ 2తోనే బిజీ అవ్వాల్సి వస్తుంది. రాజా సాబ్ షూటింగ్ ఇంకా డిలే అయ్యే అవకాశమే ఉంది.