సలార్ 365 రోజుల రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీ
బాహుబలి తర్వాత ప్రభాస్ కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన మూవీ సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన మూవీ సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. బాహుబలి తర్వాత మూడు సినిమాలు ఫ్లాప్ అయి ప్రభాస్ పని అయిపోయింది అనుకుంటున్న టైం లో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ రేంజ్ ను పెంచింది. అక్కడ నుంచి ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. వరుస ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నాడు. సలార్ సినిమా చాలా గ్రాండ్ గా ఉండటం, సినిమాలో ఎలివేషన్ సీన్స్ కొన్ని అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో యూత్ కు సినిమా బాగా కనెక్ట్ అయింది.
భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా అదే రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2023 చివర్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 16న ఓటీటీలోకి రిలీజ్ అయిన ఈ సినిమాకు అప్పటినుంచి రెస్పాన్స్ వేరే లెవెల్ లో ఉంది. ఈ యాక్షన్ త్రిల్లర్ అప్పటినుంచి ఇప్పటివరకు ఓటీటీలో టాప్ 10 లో ట్రెండింగ్ లో ఉండడం షాకింగ్ విషయం. తాజాగా దీనిపై ఈ సినిమాలో వరదరాజ మన్నార్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అయ్యాడు. 365 రోజుల నుంచి ఇప్పటివరకు ట్రేండింగ్ లో ఉండటం షాకింగ్ గా ఉందన్నాడు. అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత మా సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టిందని, అక్కడ కూడా చరిత్ర సృష్టిస్తుందంటూ కామెంట్ చేశాడు.
దీన్ని తాను ఎప్పుడు ఊహించలేదని, ఇది కేవలం రికార్డు మాత్రమే కాదని ప్రేక్షకుల ప్రేమ అన్నాడు. వారి అభిమానానికి నిదర్శనం అని పొంగిపోయాడు. ఈ ప్రయాణం నిజంగా మరుపురానిదిగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. మొదట నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు, మలయాళం, కన్నడ భాషలో సలార్ రిలీజ్ అయింది. ఆ తర్వాత జియో హాట్ స్టార్ వేదికగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. దీనితో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను ఉత్తరాదిలో టీవీలో రిలీజ్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఏకంగా 30 మిలియన్ ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. 2024 లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ త్రీ సినిమాల్లో సలార్ నిలిచింది. సలార్ పార్ట్ 1 భారీ హీట్ కావడంతో దీని సెకండ్ పార్ట్ కూడా వస్తోంది. దీనికి శౌర్యాంగపర్వం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత కంప్లీట్ చేశాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ రీస్టార్ట్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సీక్వెల్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది.