Salaar: సలార్ ఊచకోత.. 500 కోట్ల క్లబ్‌లో సలార్
విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశించిన దానికంటే ఎక్కువగా కాసులు కొల్లగొడుతోంది సలార్ . ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరి పోయింది.
Salaar: డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ దుమ్ము రేపుతోంది. ఊహించని రీతిలో కాసులు కొల్లగొడుతోంది. బాక్సులు బద్దలు కొడుతూ దూసుకు పోతోంది. గత రికార్డులు బ్రేక్ చేసిన సినిమాల వసూళ్లను తిరగ రాస్తోంది సలార్. ఇక టేకింగ్ లో, మేకింగ్ లో టాప్ లెవల్లో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ నీల్.
VICTORY VENKATESH: చిరు లేకపోతే సినిమాలు మానేసేవాడిని: విక్టరీ వెంకటేశ్
దానికి తోడు డార్లింగ్ మేనియా సినిమాకు కాసులు కురిపించేలా చేసింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశించిన దానికంటే ఎక్కువగా కాసులు కొల్లగొడుతోంది సలార్ . ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరి పోయింది. ఆరు రోజుల్లో ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ క్రాస్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాక బాక్సాఫీస్ రికార్డులను దేవా రిపేర్ చేస్తున్నాడని క్యాప్షన్ పెట్టింది. ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి మూవీ రికార్డులను దాటేందుకు దూసుకెళుతోంది. మొదటి వారం పూర్తి కాకుండానే 500 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ చిత్రం.. త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.
ఖాన్సార్’ అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ప్రభాస్ మాస్ యాక్షన్ కి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్ధలవుతున్నయి. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఫస్ట్ డే నుంచి అదే జోరు కొనసాగిస్తుంది. ఇక వసూళ్ల పరంగా చూస్తే తొలి రోజు రూ. 176.52 కోట్లు కొల్లగొట్టింది. 2వ రోజు రూ. 101.39 కోట్లు, 3వ రోజు 95.24 కోట్లు, 4వ రోజు రూ. 76.91 కోట్లు, 5వ రోజు రూ. 40.17 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా సలార్ చిత్రానికి సంబంధించి రూ. 490.23 కోట్లు సాధించింది.