SALAAR: తగ్గుతున్న సలార్ కలెక్షన్స్.. అదే కారణమా..?
సలార్ మూవీ వసూళ్లు తగ్గటానికి రీజన్ పబ్లిసిటీనే. రిలీజ్‌కి ముందు పబ్లిసిటీ చేయకున్నా ఓపెనింగ్స్ అదిరాయి. వసూళ్ల వరదలొచ్చాయి. కానీ, విడుదలై, హిట్టయ్యాక ఉండాల్సిన పోస్ట్ రిలీజ్ ప్రమోషనే మిస్ అయ్యింది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే విజయ యాత్రలు చేసేవాళ‌్లు.

Prabhas Salaar is releasing on December 22 and is creating a sensation all over the world.
SALAAR: సలార్ మూవీ వసూళ్లు నిదానంగా తగ్గుతున్నాయి. వెయ్యికోట్ల కలకు గండికొట్టేలా సీన్ రివర్స్ అవుతోంది. రూ.700 కోట్లను రీచ్ అయిన టైంలో ఇలా వసూళ్ల డ్రాప్ నిజంగా ఫిల్మ్ టీం చేసిన తప్పే అంటున్నారు. సలార్ మూవీ వసూళ్లు తగ్గటానికి రీజన్ పబ్లిసిటీనే. రిలీజ్‌కి ముందు పబ్లిసిటీ చేయకున్నా ఓపెనింగ్స్ అదిరాయి. వసూళ్ల వరదలొచ్చాయి. కానీ, విడుదలై, హిట్టయ్యాక ఉండాల్సిన పోస్ట్ రిలీజ్ ప్రమోషనే మిస్ అయ్యింది.
GUNTUR KAARAM: ప్రి రిలీజ్ ఈవెంట్ల తలరాత మార్చేసిన పవన్ కళ్యాణ్
ఒకప్పుడు సినిమా హిట్ అయితే విజయ యాత్రలు చేసేవాళ‌్లు. యానిమల్ టీం అయితే సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంది. కానీ, సలార్ టీం ఇంత పెద్ద హిట్ వచ్చినా ఉలుకూ లేదు పలుకూ లేదు. అసలు ప్రమోషన్ లేదు. దీనికి తోడు సలార్‌లో పాటల్లేవు. ఉన్న రెండు పాటలు అంత ఎఫెక్టివ్‌గా లేవు. అదే యానిమల్, పటాన్, జవాన్‌లో పాటలు తూటాల్లా పేలాయి. బేసిగ్గా మంచి సినిమాకు పాటలే అడ్డంటారు. కాని మంచి సినిమాలు హిట్టయ్యాక, జనాలు వాటి గురించి డిస్కర్స్ చేసుకోవాలన్నా, సోషల్ మీడియాలో ఆ పాటల క్లిప్పులు సందడి చేయాలి.
జైలర్‌లోని కావాలయ్యా సాంగ్ అలానే ఈమూవీకి భారీ పబ్లిసిటీ తెచ్చింది. హిట్ అయ్యాక కూడా జనం ఈమూవీ గురించి మాట్లాడుకునేలా చేసింది. అందుకే సలార్‌కి పాటలతో పాటు, సినిమా రిలీజయ్యాక జరిగే పబ్లిసిటీ లేక రూ.1000 కోట్ల రీచ్ అవటానికి టైం పడుతోంది.