Prabhas: సలార్ లో బాహుబలి కోణం..?
ప్రభాస్ సలార్ సినిమాలో ఒకటి కాదు రెండు అంశాలు బాహబులి నుంచే ప్రేరణగా తీసుకున్నాడట ఈ దర్శకుడు ప్రశాంత్ నీల్.

Salaar directed by Prashant Neel starring Prabhas has scenes inspired by Bahubali
సలార్ మూవీలో బాహుబలి ఫ్లేవర్ చూపించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఒకటి కాదు రెండు అంశాలు బాహబులి నుంచే ప్రేరణగా తీసుకున్నాడట ఈ దర్శకుడు. ఇక ఈమూవీ ట్రైలర్ వచ్చేనెల 14 న రిలీజ్ అన్నారు.కాని సెప్టెంబర్7 సాయంత్రమే ట్రలైర్ ని రిలీజ్ చేసేందుకుప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే రెండు నిమిషాల 45 సెకన్ల ట్రైలర్ ఆల్రెడీ ఎడిట్ అవటం, దానికి ప్రభాస్ డబ్బింగ్ చెప్పబోతుండటంతో, కొత్త విషయాలు లీకయ్యాయి. వాటిప్రకారం ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ వేశాడట. ఒకరు పెద్దన్నయ్య మరొకరు చిన్న తమ్మడు. వీళ్లకి మధ్యలో మరో బ్రదర్ కూడా ఉంటాడు.కాని పెద్దన్నయ్యా, చిన్న తమ్ముడు ఈ రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తాడట.
విచిత్రం ఏంటంటే ఈ రెండు పాత్రలు బాహుబలిలో తండ్రి, కొడుకుల రోల్స్ నుంచి ప్రేరణ పొందినవే అని తెలుస్తోంది. ఇక ఇందులో పిన్న తండ్రి పాత్ర తమ్ముడిని వెన్నుపోటు పొడుస్తుందట. అచ్చంగా బాహుబలిలో కట్టప్ప సీనియర్ బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టు అని తెలుస్తోంది. సలార్ టీజర్ పేలింది. ట్రైలర్ పేలబోతోంది. అందులో ఇద్దరు ప్రభాస్ ల గెటప్పులు మతిపోగొడుతాయని తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ట్రైలర్ దాడితో లెక్కలు, హైప్ మారేలా ఉంది.