Salaar: సలార్‌కు కేజీఎఫ్‌కు లింక్‌.. పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

బాహుబలి తరువాత ప్రభాస్‌ చేసిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. రాధేశ్యామ్‌, సాహో డిజాస్టర్లుగా నిలవగా రీసెంట్‌గా రిలీజ్‌ ఐన ఆదిపురుష్‌ సినిమా కూడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ యాక్టింగ్‌ బాగానే ఉన్నా.. ఓం రౌత్‌ చేసిన చాలా మిస్టేక్స్ వల్ల సినిమాకు చెడ్డ పేరు వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 21, 2023 | 11:20 AMLast Updated on: Jun 21, 2023 | 11:20 AM

Salaar Is Linked With Kgf What The New Poster Of Salaar Says Is

Salaar: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆశలు మొత్తం ఇప్పుడు సలార్‌ సినిమా మీదే ఉన్నాయి. బాహుబలి తరువాత ప్రభాస్‌ చేసిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. రాధేశ్యామ్‌, సాహో డిజాస్టర్లుగా నిలవగా రీసెంట్‌గా రిలీజ్‌ ఐన ఆదిపురుష్‌ సినిమా కూడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ యాక్టింగ్‌ బాగానే ఉన్నా.. ఓం రౌత్‌ చేసిన చాలా మిస్టేక్స్ వల్ల సినిమాకు చెడ్డ పేరు వచ్చింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ బ్లాక్‌బస్టర్‌ కోసం సలార్‌ మీదే భారం వేశారు. ప్రస్తుతం షూటింగ్‌ ఎండింగ్‌ స్టేజ్‌లో ఉన్న సలార్‌ సినిమాను సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్‌డేట్‌ ఇస్తూ 100 డేస్‌ ఫర్‌ సలార్‌ అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ పోస్టర్‌లో ఉన్న కొన్ని బాక్స్‌లు ఇప్పుడు ఫ్యాన్స్‌ను సస్పెన్స్‌లో పడేశాయి. పోస్టర్‌లో కనిపిస్తున్న బాక్స్‌లు. కేజీఎఫ్‌-2 క్లైమాక్స్‌లో రాఖీభాయ్‌ సముద్రంలో పడేసే బాక్సుల్లా ఉన్నాయి. సలార్‌ సినిమాకు కేజీఎఫ్‌ సినిమాకు లింక్‌ ఉంటుందంటూ చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

దీని గురించి ఎలాంటి ఆధారం లేకున్నా అంతా ఇదే అనుకుంటున్నారు. కారణం ఈ సినిమా కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే రావడం. కేజీఎఫ్‌ సినిమాకు ఈ సినిమాను లింక్‌ చేస్తూ ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ తీస్తున్నాడనేది టాక్‌. ఇప్పుడు సలార్‌ పోస్టర్‌లో కేజీఎఫ్‌ బాక్సులు కనిపించడంతో నిజంగానే కేజీఎఫ్‌కు సలార్‌కు లింక్‌ ఉందంటున్నారు ఫ్యాన్స్‌. మూవీ టీం ఇచ్చిన అప్‌డేట్‌ కంటే పోస్టర్‌లో కనిపిస్తున్న బాక్సులే ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే నిజంగానే ఈ సినిమాకు కేజీఎఫ్‌ సినిమాకు లింక్‌ ఉంటుందా లేదా చూడాలంటే సెప్టెంబర్‌ వరకూ ఆగాల్సిందే.