Salaar: ట్రైలర్ రెడీ.. కేరళ రైట్స్ దక్కించుకున్న సలార్ విలన్..

ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన సలార్.. ఫైనల్‌గా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఆ రోజు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. మరోసారి సలార్ వాయిదా పడుతుందనే పుకార్లు వస్తున్నాయి. కొందరు నార్త్ వాళ్లు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2023 | 06:14 PMLast Updated on: Nov 06, 2023 | 6:14 PM

Salaar Malayalam Superstar Prithviraj Sukumaran To Present The Prabhas Starrer In Kerala

Salaar: కేజీఎఫ్ (KGF) తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. రెబల్ స్టార్ ప్రభాస్ (Salaar) హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన సలార్.. ఫైనల్‌గా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఆ రోజు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. మరోసారి సలార్ వాయిదా పడుతుందనే పుకార్లు వస్తున్నాయి.

కొందరు నార్త్ వాళ్లు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లోను ఈసారి అనుకున్న సమయానికి సలార్ రావడం పక్కా అని మేకర్స్ క్లారిటి ఇస్తూనే ఉన్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో సలార్ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ హై ఓల్టేజ్ ట్రైలర్‌ను నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నాడట. అందుకే.. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్ క్లారిటీ రానుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై హైప్‌ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. అందుకే, ట్రైలర్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సలార్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది.

ఇప్పటికే తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.170 నుంచి 175 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. తాజాగా కేరళ సలార్ రైట్స్‌ను హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దక్కించుకున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే.. సొంత భాష మళయాళంలో పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.