SALAAR: సలార్ క్రేజ్.. దిమ్మతిరిగేలా బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

ప్రభాస్ గత సినిమాలు కాస్త నిరాశ పర్చినప్పటికీ.. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. దిమ్మ తిరిగే రేంజ్‌లో జరుగుతున్న సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్సే దీనికి పెద్ద ఉదాహరణ. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫిల్మ్‌ మేకర్ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో సలార్ రూపొందుతున్న విషయం తెల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2023 | 03:07 PMLast Updated on: Nov 28, 2023 | 3:07 PM

Salaar Movie Business Creating Records In Telugu States

SALAAR: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్‌డమ్, రేంజ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో రికార్డులు కొల్లగొట్టిన ఈ డార్లింగ్. దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టి ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇక ప్రభాస్ గత సినిమాలు కాస్త నిరాశ పర్చినప్పటికీ.. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. దిమ్మ తిరిగే రేంజ్‌లో జరుగుతున్న సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్సే దీనికి పెద్ద ఉదాహరణ. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫిల్మ్‌ మేకర్ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో సలార్ రూపొందుతున్న విషయం తెల్సిందే.

MAHESH BABU: కండీషన్స్‌తో మహేశ్‌కు చుక్కలు చూపిస్తున్న రాజమౌళి..!

సలార్‌‌ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. డిసెంబర్‌ నెలలో సలార్ సినిమాను విడుదల చేసే విధంగా ఇప్పటికే కొత్త తేదీని ప్రకటించారు. మరో వైపు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చకచక చేస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో చాలా నెంబర్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా రూ.160 కోట్లకు పైగా బిజినెస్ చేసి సర్‌ ప్రైజ్‌ చేసింది ఈ మూవీ. ఒక్క నైజాంలోనే రూ.90 కోట్ల బిజినెస్ చేసి షాకిచ్చింది. ఒక వైపు సలార్‌ భారీ వసూళ్ల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రూ.700 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. ఒక వేళ సలార్ సినిమా రూ.వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తే కచ్చితంగా అందులో ఏడు వందల కోట్లు బయటి నుంచి రావాల్సి ఉంది.

సలార్ సినిమాలో భారీ సెట్టింగ్స్‌తో కమర్షియల్‌గా మాస్ ఎలిమెంట్స్‌తో సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి.. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు. ఈ సారి తమ డార్లింగ్ తన రేంజ్‌కు తగ్గ పెద్ద హిట్‌ను అందుకోబోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.