SALAAR: సెన్సార్ నివేదిక.. సలార్‌కి పాజిటివ్ రివ్యూలు.. ఫ్యాన్స్‌కి పండుగే!
ఇప్పుడు టీమ్ ఫైనల్ కాపీని లాక్ చేసి, 176 నిమిషాల రన్‌టైమ్, A సర్టిఫికేట్‌తో సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసింది. సెన్సార్ రిపోర్ట్ ఏకగ్రీవంగా పాజిటివ్‌గా రావడంతో ఇండస్ట్రీ సర్కిల్స్‌లో సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.
SALAAR: ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా మూవీగా తెరపైకి రానుంది. కంప్లీట్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంపై కొంతకాలంగా అనుకున్నంత బజ్ లేదు. అయితే, సలార్ సెన్సార్ నివేదికతో అంచనాలు పెరిగిపోయాయి. సలార్ చిత్రం చుట్టూ గత కొంత కాలంగా నెగిటివ్ బజ్ ఏర్పడింది. అవుట్‌పుట్‌తో టీమ్ సంతోషంగా లేదని కూడా వార్తలు వచ్చాయి.
Tollywood Top Stars : ఆ నలుగురు స్టార్ల ఊసే లేదు..
ప్రశాంత్ నీల్ స్వయంగా సినిమాను వాయిదా వేశారని, సినిమాలోని కొన్ని కీలకమైన భాగాలను రీషూట్ చేశారని, రీషూట్ చేసిన మరికొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను జోడించారని తెలుస్తోంది. ఇప్పుడు టీమ్ ఫైనల్ కాపీని లాక్ చేసి, 176 నిమిషాల రన్‌టైమ్, A సర్టిఫికేట్‌తో సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసింది. సెన్సార్ రిపోర్ట్ ఏకగ్రీవంగా పాజిటివ్‌గా రావడంతో ఇండస్ట్రీ సర్కిల్స్‌లో సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. సెన్సార్ టాక్ ప్రేక్షకుల నోటి మాటగా మారితే మాత్రం సలార్ ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు ఎదురుచూస్తున్నంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. చాలా ఈజీగా రూ.1000 కోట్లు కలెక్షన్లు రాబడుతుందన్న టాక్ నడుస్తోంది. ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సరైన మిక్స్‌తో సలార్ చిత్రం ఉంటుందని ట్రైలర్, సాంగ్‌ను బట్టి అర్థమవుతోంది. మూడు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని.. అందులో ఒకటి ఇంటర్వెల్‌లో వస్తే.. మిగతా రెండు సెకండాఫ్‌లో వస్తాయని తెలుస్తోంది.
అలాగే మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ కూడా బాగా పనిచేశాయని సమాచారం. సలార్ సెన్సార్ రిపోర్ట్ ఏకగ్రీవంగా సానుకూలంగా ఉంది. ప్రశాంత్ నీల్‌లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే అతను తన చిత్రాలలో ఏది పనిచేస్తుందో, ఏది చేయదో స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చాలా మంది దర్శకులు బ్లాక్‌బస్టర్ సినిమా తీశామని ఫిక్స్ అయ్యి అంతా వర్క్ అయిపోయిందని రిలీజ్ తర్వాత తమ తప్పులు తెలుసుకుంటున్నారు. అయితే చిత్రీకరణ దశలోనే ప్రశాంత్ నీల్ సినిమాలోని తప్పులను కనిపెట్టాడు. సినిమాని వాయిదా వేయకుండా విడుదల చేయాలని మేకర్స్ నుంచి చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ, అతను విడుదలను వాయిదా వేసి, రీషూట్ పూర్తి చేసేలా అందరినీ ఒప్పించాడు. ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ ప్రకారం అన్నీ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్.. ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుందో.