SALAAR: మూడు రోజుల్లో 400 కోట్లు.. వెయ్యి కోట్లు సాధ్యమేనా..?
హిందీ మార్కెట్ విషయానికొస్తే అక్కడ బాహుబలి2 మూవీకి రూ.500 కోట్లు వచ్చాయి. కేజీయఫ్ చాప్టర్ 2కి రూ.435 కట్లు వచ్చాయి. త్రిబుల్ ఆర్ కూడా రూ.275 కోట్లు రాబట్టింది.

Prabhas Salaar is releasing on December 22 and is creating a sensation all over the world.
SALAAR: సలార్ మూవీ మొదటి రోజు రూ.165 కోట్లు ఓపెనింగ్స్ రాబడితే, మూడు రోజుల్లో ఆ లెక్క రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌గా తేలింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే మరో 5 రోజుల్లోనే మరో రూ.600 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే కేవలం 8 రోజుల్లోనే సలార్ వెయ్యికోట్ల క్లబ్‌లో చేరుతుందనిపిస్తోంది. కాకపోతే సలార్ మూవీ తెలుగు, హిందీ వర్షన్ హిట్టైంది.
Game Changer : గెట్ రెడీ ఫ్యాన్స్ ’గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఇదే..
కాని కన్నడలో ఆల్రెడీ అక్కడి జనం ఉగ్రం మూవీ చూడటం, దాని స్టోరీ లైన్‌తోనే సలార్ రావటంతో జనం ఈ సినిమాపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో అక్కడ కలెక్షన్స్ తగ్గాయి. మళయాలంలో మోహన్‌లాల్ మూవీ అడ్డు పడటంతో అక్కడ వసూళ్ల వరద లేదు. తమిళనాడులో కాస్త పర్లేదు. దీంతో తమిళ, మలయాళ, కన్నడలో సలార్ సోసోగా దూసుకెళుతోంది. తెలుగు, హిందీ మార్కెట్‌లో దూకుడు మామూలుగా లేదు. హిందీ మార్కెట్ విషయానికొస్తే అక్కడ బాహుబలి2 మూవీకి రూ.500 కోట్లు వచ్చాయి. కేజీయఫ్ చాప్టర్ 2కి రూ.435 కట్లు వచ్చాయి. త్రిబుల్ ఆర్ కూడా రూ.275 కోట్లు రాబట్టింది.
కాబట్టి హిందీలో కనీసం రూ.400 కోట్లు దాటితే తప్ప సలార్ ఓవరాల్‌గా వెయ్యికోట్ల వసూళ్ల లిస్ట్‌లో చేరదు. ప్రస్తుత ట్రెండ్ చూస్తే అది సాధ్యమౌతుంది అనిపిస్తోంది. 3 రోజుల్లో నార్త్‌లో సలార్ రూ.53 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఏదేమైనా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పంచ్‌తో డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా చేసింది సలార్. దీంతో మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో తెలిసొచ్చినట్టైంది.