Salaar: సలార్ షాక్.. ప్రభాస్ లేకుండా అలా చేస్తున్నారేంటి..!

ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. సలార్‌లో రెండే రెండు సాంగ్స్ ఉంటాయని ముందు నుంచి ప్రచారంలో ఉంది. లాస్ట్ మినిట్‌లో ఐటెం సాంగ్ యాడ్ చేశారని.. రీసెంట్‌గా షూట్ కూడా చేశారనే టాక్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 06:18 PMLast Updated on: Nov 14, 2023 | 6:18 PM

Salaar Movie Item Song Shot Without Prabhas

Salaar: ఎట్టకేలకు.. సలార్ మేకర్స్ సాలిడ్ ట్రీట్ ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ హంగామా మొదలైంది. దీపావళి కానుకగా డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రానుందని పవర్ ఫుల్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అందులో ప్రభాస్ గన్‌ ఫైరింగ్ చూసి.. ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. డిసెంబర్ 1న రాత్రి 7 గంటల 19 నిమిషాలకు డిజిటల్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు కానున్నాయి. అలాగే ఆరోజు నుంచే సలార్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కానున్నాయి.

Tamannaah Bhatia: పెళ్లి బాట.. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడంటే..?

మూడు వారాల పాటు సలార్‌ ప్రమోషన్స్ జరగనున్నాయి. డిసెంబర్ 22న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లోకి రానుంది. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. సలార్‌లో రెండే రెండు సాంగ్స్ ఉంటాయని ముందు నుంచి ప్రచారంలో ఉంది. లాస్ట్ మినిట్‌లో ఐటెం సాంగ్ యాడ్ చేశారని.. రీసెంట్‌గా షూట్ కూడా చేశారనే టాక్ ఉంది. యంగ్ బ్యూటీ సిమ్రత్ కౌర్‌ ఈ సాంగ్‌లో చిందేసిందట. ఇప్పుడు ఈ సాంగ్‌పై లేటెస్ట్ ట్విస్ట్ ఒకటి షాకింగ్‌గా మారింది. అసలు ఈ సాంగ్‌లో ప్రభాస్ కనిపించడట. ఈ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు విదేశాల్లో ఉన్నాడు ప్రభాస్. దీంతో.. ఐటెం సాంగ్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్సెస్ తక్కువని అంటున్నారు. మరి సలార్ లేకుండా.. సాంగ్ ఎందుకు అనేదే ఇప్పుడు అర్థం కాకుండా పోయింది.

కానీ ప్రశాంత్ నీల్ అంత ఈజీగా సినిమాలో ఐటెం సాంగ్‌ పెట్టడు. ఖచ్చితంగా ఈ పాట వచ్చే సందర్భం బలంగా ఉంటుందని అంటున్నారు. సలార్ తర్వాత వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రభాస్ నటించిన కల్కి మూవీ రానుంది. తర్వాత మారుతి మూవీ ఉండనుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తారు. ఇలా వరసగా సినిమాలు చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.