SALAAR: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా.. ఆఫ్‌లైన్‌లో సలార్ టిక్కెట్లా..?
ఈ జనరేషన్‌లో ఆన్‌లైన్ టిక్కెట్ బుక్కింగ్స్ తీసేసి, జనాలను క్యూలో నిలుచుని టిక్కెట్లు తీసుకోవాలనటం పిచ్చి తనమే అవుతుంది. ఇలా సలార్ విషయంలో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రీ మేకర్స్ నిర్ణయం తీసుకోవటం చూసి ఏమనుకోవాలి..?
SALAAR: సలార్ మూవీ కోసం క్యూలైన్లో జనాలు.. టిక్కెట్ల జోరు.. లాఠీలు పట్టి జనాలను కొడుతున్న తీరు.. ఇవన్నీచూస్తే తెలంగాణలో సలార్ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఓ చెత్త నిర్ణయం విమర్శలకు కారణమౌతోంది. గతంలో ఓ స్టార్ హీరో మూవీ వస్తోందంటే.. జనాలు వందల మీటర్ల వరకు క్యూ కట్టడం చూశాం. అప్పడు తక్కువ థియేటర్లు ఉండేవి. అలానే ఆన్‌లైన్ బుకింగ్స్ లేకపోవటం కారణం అనుకోవచ్చు.
Global Star, Mega Daughter : మహాలక్ష్మి ఆలయంలో మెగా డాటర్ పూజలు..
కాని ఈ జనరేషన్‌లో ఆన్‌లైన్ టిక్కెట్ బుక్కింగ్స్ తీసేసి, జనాలను క్యూలో నిలుచుని టిక్కెట్లు తీసుకోవాలనటం పిచ్చి తనమే అవుతుంది. ఇలా సలార్ విషయంలో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రీ మేకర్స్ నిర్ణయం తీసుకోవటం చూసి ఏమనుకోవాలి..? తమ మూవీ కోసం జనాలు ఎలా తండోపతండాలుగా వస్తున్నారని చూపించాలి అనుకుంటున్నారా..? కానీ, ఇలా చేస్తే క్యూలైన్లో ఒకప్పటిలా టిక్కెట్లకోసం జనం కొటక్టుకోవటం, తోపులాట ఇవన్నీ జరిగి ఎవరికైనా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి..? అయినా థియేటర్స్‌కి వచ్చే టిక్కెట్ తీసుకోవాలి.. ఆన్‌లైన్ టిక్కెట్ బుక్కింగ్స్ వద్దంటే.. బ్లాక్ టిక్కెట్ల జోరు పెరిగే అవకాశం ఉంది.
ఎవరైనా డాక్టర్ చదివి కాంపౌడర్‌గా ప్రాక్టీస్ పెడతారా? తెలంగాణలో ఇలా చాలా థియేటర్స్‌కి ఆన్‌లైన్ టిక్కెట్ బుక్కింగ్ తీసేసి పాత పద్దతి తెచ్చి.. పిచ్చీ పీక్స్‌కి తీసుకెళుతున్నారు మైత్రీ సంస్థ అధినేతలు. ఇకపై ఇలాంటి ఆలోచన చేయకుండా ఉంటే మంచిదని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు చెబుతున్నారు.