SALAAR: మాస్ కా స్వాగ్‌.. కాన్సార్‌ ఎరుపెక్కాలా.. బాక్సాఫీస్‌ బద్ధలవ్వాల్సిందే..

శుక్రవారం ఎప్పుడొస్తుందా అని.. క్యాలెండర్‌ వైపే చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. ఫస్ట్ ట్రైలర్ పిచ్చెక్కిస్తే.. రిలీజ్‌ ట్రైలర్‌ ఆ పిచ్చిని పీక్స్‌కు చేర్చింది. కేజీఎఫ్‌‌ను నుంచి మించి ఎలివేషన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్‌ చూస్తే పక్కాగా అర్థం అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 03:58 PMLast Updated on: Dec 18, 2023 | 3:58 PM

Salaar Release Trailer Released With High Action Scenes

SALAAR: కోరుకున్నది తెచ్చి ఇస్తాడు.. వద్దనుకున్నది అంతం చేస్తాడు.. సలార్ రిలీజ్ ట్రైలర్‌‌లో ఈ డైలాగ్‌ చాలు.. సినిమా రేంజ్ చెప్పడానికి! సలార్ రిలీజ్‌ కోసం అభిమానులంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. శుక్రవారం ఎప్పుడొస్తుందా అని.. క్యాలెండర్‌ వైపే చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. ఫస్ట్ ట్రైలర్ పిచ్చెక్కిస్తే.. రిలీజ్‌ ట్రైలర్‌ ఆ పిచ్చిని పీక్స్‌కు చేర్చింది. రక్తంతో మండించే మంటలు.. రక్తం ఎరుపెక్కే సామ్రాజ్యాలు.. రక్తం అంటుకున్న ఇద్దరు స్నేహితులు.. కాన్సారా ప్రాంతానికి ఎలాంటి అవసరం వచ్చింది.. ఈ ఇద్దరి ఆ అవసరాన్ని ఎలా తీర్చారు.. ఎవరి కథ ఏంటి.. ఇద్దరు స్నేహితుల లక్ష్యం ఏంటి.. ఈ కథ తెలుసుకుంటున్న హీరోయిన్‌ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. రిలీజ్ ట్రైలర్‌ చాలా ప్రశ్నలే మిగిల్చింది.

Srileela  : శ్రీలీల MBBS చదువుకోండి ఫస్టు

హైలైట్‌ ఆఫ్‌ ది ట్రైలర్ ఏంటంటే.. ఆ గన్‌ సీన్‌ ! కేజీఎఫ్‌లో వాడిన పెద్ద తుపాకులు.. ఆరు తీసుకొచ్చారు సలార్‌కు. ఈ మూవీకి, కేజీఎఫ్‌కు లింక్ ఉందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. వయొలెన్స్ మాత్రం కామన్‌గా ఉంది. కేజీఎఫ్‌‌ను నుంచి మించి ఎలివేషన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్‌ చూస్తే పక్కాగా అర్థం అవుతోంది. మెకానిక్‌గా పనిచేసే హీరో.. ఫ్రెండ్‌ కోసం కాన్సారాకు ఎందుకొచ్చాడు.. స్నేహితుడికి వచ్చిన కష్టం ఏంటి.. ఇచ్చిన మాట ఏంటి.. ఇలా చాలా విషయాలు సస్పెన్స్‌లో పెట్టి.. మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మీద ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి అనే రేంజ్‌లో.. ట్రైలర్‌లో శాంపిల్ చూపించాడు రవి బస్రూర్‌. ట్రైలర్ మధ్యలో దాహంగా ఉంది.. మందు ఉందా అని అంటుంది శృతిహాసన్ కేరక్టర్‌. ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్ చూసిన ప్రతీ ప్రేక్షకుడికి కలిగే ఫీలింగ్ అది.

Bigg Boss Season 7 : బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు షాక్‌

ప్రభాస్ మూవీ డైలాగ్‌లానే చెప్పాలంటే.. ఆకలితో వేటాడే పులిని చూసుంటారు.. ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు.. డార్లింగ్‌ మాత్రం హిట్‌ లేక చాలా ఏళ్ల ఉపవాసం తర్వాత వేటాడుతున్న పులి. సలార్ ఆ ఆకలి తీర్చడం ఖాయంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 22 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.