Salaar : సలార్‌ సెన్సేషన్.. హాట్ కేకుల్లా ప్రీ బుకింగ్స్

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ ఫిల్మ్‌ మేకర్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన 'సలార్‌' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 25, 2023 | 04:40 PMLast Updated on: Nov 25, 2023 | 4:40 PM

Salaar Sensation Pre Bookings Like Hot Cakes

 

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ ఫిల్మ్‌ మేకర్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన ‘సలార్‌’ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇంకా ట్రైలర్ విడుదల అవ్వకుండానే సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ గురించి చర్చ జరుగుతుంది అంటే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ విషయం అట్లుంచి ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్‌ కు దిమ్మతిరిగేలా చేస్తుంది.

Puri Jagannath : అప్పుడు పవన్, మహేశ్, చరణ్, ప్రభాస్‌ కోసం ఇప్పుడు రామ్ కోసం ..!

‘సలార్’ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ తర్వాత వచ్చిన చిత్రాలు వందల కోట్లు కలెక్షన్స్ వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టలేకపోయాయి. ఇటీవల రిలీజైన ఆదిపురుష్ సైతం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సలార్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే అంతేస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది ప్రభాస్ సలార్. విడుదలకే ముందే ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. రీసెంట్ గా నార్త్ అమెరికాలో సలార్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. కొద్ది క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

జస్ట్ అరగంట లోనే 10 వేల టికెట్లు అమ్ముడు పోవడంతో పాటు రూ.మూడు లక్షల రూపాయల గ్రాస్ నెల రోజుల ముందే వచ్చేసిందంటున్నారు. కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని చిత్రయూనిట్ పట్టుదలతో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్‌లో సలార్ కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క అమెరికాలోనే ఈ రేంజ్‌లో సలార్‌ ప్రీ బుకింగ్స్‌ కావడంతో.. ఇక ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.