Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్‌కు సీక్వెల్ ఫిక్స్.. పార్ట్-2 ఎప్పుడంటే!
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇంతకీ ఈ సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందంటే..
Salaar: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీసే ప్లాన్‌లో ఉన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. సినిమా రన్ టైం 3 గంటలు ఉన్నట్టు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వచ్చే సెప్టెంబర్ 28న సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ పార్ట్ కూడా సిద్ధం చేశాడట ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ మాదిరిగానే ఈ సినిమాను కూడా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తాడట. సలార్ పార్ట్ వన్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే సలార్ పార్ట్-2 షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. పార్ట్-2ను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట.
ఏమాత్రం హడావిడి లేకుండా పార్ట్-2 కూడా షూట్ చేసి 2026లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. సినీ వర్గాల్లో ఈ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న సలార్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సినిమా రిలీజైన 3-4 వారాల పాటు పెద్ద సినిమాలేవీ లేకుండా చూసుకుంటున్నారట. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్‌గా ప్రభాస్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో.. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ కూడా అదే రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు.
ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో యాక్షన్ మూవీ రాబోతోంది అంటే.. ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు సినిమా లవర్స్ అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే సలార్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు పార్ట్-2 కూడా ఉంటుందని తెలియడంతో డబుల్ షాట్ చాక్లెట్స్ దొరికినట్టైంది. మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ షేక్ చేయబోతున్నాడంటున్నారు ఆయన ఫ్యాన్స్. సలార్ రెండు పార్ట్‌లు కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం గ్యారెంటీ అంటున్నారు.