Salaar: సలార్ 2 ఎప్పుడో తెలుసా..? సీక్వెల్ ప్లానింగ్ లీకైంది..!

సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏంటంటే.. సలార్ సీక్వెల్ షూటింగ్ తాలూకు సమాచారం లీకైంది. సలార్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ఎప్పుడో వెల్లడైంది. ఇక ఇప్పటికే సలార్ 1 షూటింగ్ పూర్తైంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ రాబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 20, 2023 | 05:25 PMLast Updated on: May 20, 2023 | 5:25 PM

Salaar Sequel Planning Leaked Here Is The Details

Salaar: సలార్ మూవీ టీజర్ రెడీ. 55 సెకన్ల నిడివితో ఎప్పుడో ఎడిట్ చేసి మూడు వర్షన్లు రెడీ చేశారు. జులై 16 తర్వాత.. అంటే ఆదిపురుష్ సందడి అయ్యాక ఈ టీజర్ వస్తుంది. అంతవరకు బానే ఉంది. ఇక్కడ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏంటంటే.. సలార్ సీక్వెల్ షూటింగ్ తాలూకు సమాచారం లీకైంది. సలార్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ఎప్పుడో వెల్లడైంది. ఇక ఇప్పటికే సలార్ 1 షూటింగ్ పూర్తైంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ రాబోతుంది. జులై నెల మధ్యనుంచి ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీతో బిజీ కాబోతున్నాడు. కాకపోతే దసరాకు తారక్‌తో మూవీ లాంచ్ చేసి, 2024 సంక్రాంతి నుంచి షూటింగ్ షురూ చేస్తాడట.

ఇది పూర్తిగా మాస్ మూవీ అవటంతో, 6 నెలల్లో అంటే 2024 జూన్ లోగా టాకీ పార్ట్, సెప్టెంబర్ లోగా సాంగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తువుతాయట. ఈలోగా అంటే వచ్చే ఏడాది ఆగస్ట్ నుంచి సలార్ 2 మొదలవ్వొచ్చని తెలుస్తోంది. సలార్ రెండో భాగంలో తన రోల్ బాగుంటుందని మలయాళ హీరో పృథ్వీ రాజ్ అన్నప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని తేలింది. కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం, 2024 ఆగస్ట్ కి సలార్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వొచ్చన్నమాట.