Salaar: దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సీజన్లకు నో చెప్పారా..?
దీపావళికి సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఉంది. దాంతో పాటే సలార్ పోటీ పడితే, థియేటర్లు తగ్గుతాయి. వసూళ్లు చీలిపోతాయి. అది డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాన్ని తెచ్చే అంశం. సలార్ మూవీ దీపావలి రిలీజ్‌కి నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ నో అన్నారు. పోనీ, సౌత్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఓకే.
Salaar: సలార్ మూవీ దీపావళి, లేదంటే క్రిస్మస్, కాదంటే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ టీం కూడా అందుకు ఏర్పాట్లు చేసింది. కాని నార్త్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే టీం మాత్రం నో అంటున్నారు. దీపావళికి సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఉంది. దాంతో పాటే సలార్ పోటీ పడితే, థియేటర్లు తగ్గుతాయి. వసూళ్లు చీలిపోతాయి. అది డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాన్ని తెచ్చే అంశం. సలార్ మూవీ దీపావలి రిలీజ్‌కి నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ నో అన్నారు. పోనీ, సౌత్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఓకే.
కానీ, నార్త్ పెద్ద మార్కెట్. అక్కడ సినిమా రిలీజ్ కాకపోతే యాబై శాతం వసూళ్లు వదులుకున్నట్టే. అందుకే క్రిస్మస్‌ని టార్గెట్ చేసుకుందామంటే, అప్పుడు రణ్‌బీర్‌కపూర్ మూవీ యానిమల్ రాబోతోంది. అలానే షారుఖ్ సినిమా డంకీ రానుంది. అసలే రెండు హిట్లతో దూసుకెళ్తన్న షారుక్‌తో త్రీ ఇడియట్స్ ఫేం రాజ్ కుమార్ హిరానీ తీస్తున్నమూవీ వస్తోందంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది. అందుకే క్రిస్మస్‌కి సలార్ వస్తే, నార్త్ డిస్ట్రిబ్యూటర్లకి నష్టమనే భయం వెంటాడుతోంది. బాహుబలితో ప్రభాస్‌కి ఎంత మార్కెట్ ఉన్నా, తన సినిమాకి ఎంత క్రేజ్ ఉన్నా, పోటీకి బాలీవుడ్ బడా బ్యాచ్ రంగంలోకి దిగితే, ఎంతో కొంత నష్టం వచ్చే చాన్స్ ఉంది. కాబట్టే హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నో అంటున్నారు. సరే సంక్రాంతికైనా సలార్ వస్తుందా, అంటే అందుకు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవట్లేదట.
ఒకవైపు గుంటూరు కారం, మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే చాన్స్ ఉంది. కాబట్టి వీటి మధ్య సలార్ వస్తే, వీటన్నీంటి కోసం థియేటర్లు ఎలా సర్దాలి..? అలా సర్దుకుంటూపోతే లాభాలెలా వస్తాయి..? అలాగని ఇంకొన్నాల్లు వేయిట్ చేద్దామా అంటే, ఆల్రెడీ ఏరియా రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మరింత కాలం వేయిట్ చేసేలా లేరు. ఇలా.. మింగలేక, కక్కలేక అన్నట్లు ఉంది సలార్ రిలీజ్ పరిస్థితి.