SALAAR: ఎవడ్రా రీమేక్ అనేది.. ట్రైలర్ చూసారా ఇంతకీ..
KGFతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్‌తో బాహుబలి రికార్డునే టార్గెట్ చేస్తున్నాడు. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చే వరకు ప్రమోషన్స్ అంతంతమాత్రంగానే సాగాయి.
SALAAR: సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఉగ్రమ్ సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, ఉగ్రమ్ కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
SALAAR Vs DUNKI: దిగజారుడు.. సలార్‌పై విషం కక్కుతున్న బాలీవుడ్
ఉగ్రమ్ సినిమాలోని సీన్స్‌ని, సలార్ సినిమా సీన్స్ పోలుస్తూ.. రెండూ ఒకటే అంటూ చెప్పారు. ఇదే అదునుగా తీసుకోని యాంటి ఫ్యాన్స్, సలార్‌పై మరిన్ని విమర్శలు చేసారు. ప్రభాస్ ఎక్కువ సేపు లేడు.. డైలాగ్ డెలివరీ బాగోలేదు.. పృథ్వీరాజ్ మాత్రమే కనిపిస్తున్నాడు.. ట్రైలర్ అంతా KGFలాగే ఉంది.. అంటూ అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ అన్నింటినీ రెండో ట్రైలర్ దెబ్బతో సైలెంట్ చేసేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. KGFతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్‌తో బాహుబలి రికార్డునే టార్గెట్ చేస్తున్నాడు. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చే వరకు ప్రమోషన్స్ అంతంతమాత్రంగానే సాగాయి.
DUNKI: డంకీతో మ్యాజిక్ రిపీటయ్యేనా..? షారుఖ్, హిరానీ కాంబో హిట్ కొడుతుందా..?
రిలీజ్ ట్రైలర్ బయటకి రాబోతుంది అని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఇది ఖాన్సార్ కథ, ఖాన్సార్‌లో డైనోసర్ లాంటి వాడి కథ అంటూ ట్రైలర్‌తో శాంపిల్ చూపించాడు ప్రశాంత్ నీల్. రిలీజ్ ట్రైలర్‌తో అంచనాలని ఆకాశానికి పెంచిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి ఓపెనింగ్స్‌ని రాబడతారు అనేది చూడాలి.