Salaar: మాస్ ర్యాంపేజ్‌కి గెట్ రెడీ.. సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో సలార్‌‌ను మించిన మాస్ సినిమా రాలేదని.. ఈ సినిమా క్యాస్టింగ్ ఎలివేషన్ ఇస్తోంది. రెండు భాగాలుగా రానున్న సలార్‌పై ఊహకందని అంచనాలున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సలార్ బాక్సాఫీస్ ర్యాంపేజ్‌ను తట్టుకోవడం కష్టమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 06:37 PMLast Updated on: Nov 09, 2023 | 6:37 PM

Salaar Trailer Release Date Fixed By Makers And Movie Releasing In December

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్దమవ్వండి. తాజాగా మోస్ట్ అవైటేడ్ సలార్ ట్రైలర్ డేట్ లాక్ చేశారు మేకర్స్. దీంతో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది.’ఈ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్‌లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. మరో ఆరు వారాల్లో బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ జాతర జరగబోతోంది.

Guntur Karam : త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్.. గుంటూరు కారం లో యంగ్ టైగర్.. పూనకాలే

ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో సలార్‌‌ను మించిన మాస్ సినిమా రాలేదని.. ఈ సినిమా క్యాస్టింగ్ ఎలివేషన్ ఇస్తోంది. రెండు భాగాలుగా రానున్న సలార్‌పై ఊహకందని అంచనాలున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సలార్ బాక్సాఫీస్ ర్యాంపేజ్‌ను తట్టుకోవడం కష్టమే. అయితే.. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందనే టాక్ నడుస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 22న సలార్ రావడం పక్కా అని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు.. ట్రైలర్ డేట్ కూడా లాక్ చేశారు. డిసెంబర్ 1న సలార్ మాసివ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ట్రైలర్ అనౌన్స్మెంట్ అని ప్రకటించారు మేకర్స్. కానీ డిసెంబర్ 1న అని ఇప్పటికే ఫిల్మ్ వర్గాలకు లీకులు ఇచ్చేసింది. దీంతో ఆ రోజు డిజిటల్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు కావడం పక్కా అంటున్నారు. ఇకపోతే.. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్‌ డిసెంబర్ 21 నుంచే ప్రీమియర్స్ పడుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మళ్లీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.

మరోవైపు బిజినెస్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు హోంబలే ఫిలింస్ వారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్‌తో పాటు.. కన్నడ, మళయాళ డీల్ కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయని టాక్. కానీ హిందీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదని తెలుస్తోంది. అది కూడా కంప్లీట్ అయితే.. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు ప్రభాస్. కాబట్టి.. ఇప్పటి నుంచి సలార్ ర్యాంపేజ్ మామూలుగా ఉండదనే చెప్పాలి.