SALAAR TRAILER: రేర్ రికార్డ్.. సలార్‌కు మాసివ్ రెస్పాన్స్.. సెంచరీ కొట్టేశాడు..!

ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే సంచనాలకు కేరాఫ్‌గా మారడంతో పాటు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. యాక్షన్, ఎమోషన్‍తో సలార్ ట్రైలర్ నిండిపోయింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 05:29 PMLast Updated on: Dec 02, 2023 | 5:38 PM

Salaar Trailer Takes Youtube By Storm 100m Plus Views Counted

SALAAR TRAILER: సలార్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రెబల్ స్టార్ సునామికీ సోషల్ మీడియా అల్లకల్లోలం అవుతోంది. దోస్త్ కోసం ప్రభాస్ చేస్తున్న యుద్దానికి సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. జస్ట్ శాంపిల్‌గా వదిలిన మోస్ట్ అవైటెడ్ ట్రైలర్‌తోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే సంచనాలకు కేరాఫ్‌గా మారడంతో పాటు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. యాక్షన్, ఎమోషన్‍తో సలార్ ట్రైలర్ నిండిపోయింది.

PAWAN KALYAN: పవన్ బిజీ.. ఏపీలో ఎన్నికల తర్వాత పవన్ చేయబోయే మూవీ ఇదే!

ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ క్రమంలో యూట్యూబ్‍లో వ్యూస్ విషయంలో సలార్ ట్రైలర్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ట్రైలర్ వచ్చి ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాకుండానే ఎన్నో రికార్డ్స్ సెట్ చేస్తోంది. కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టేసింది. దీంతో కలెక్షన్స్ విషయంలోను సలార్ సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అయితే ఈ ఐదు భాషల్లో ఇప్పుడు ఏకంగా సెంచరీ దాటేసిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన హొంబలే ఫిల్మ్స్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌కు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఈ జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

తమిళం, కన్నడ, మలయాళంలోనూ సలార్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో పాటు ఈ సినిమాపై ఆడియెన్స్ ఏ లెవెల్లో ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్స్‌లో ఒకటిగా అయితే ఇపుడు సలార్ నిలిచింది. మరి ఇప్పటికీ ఈ మాస్ రెస్పాన్స్ కొనసాగుతూ ఉండగా ఇక ముందు మరిన్ని వ్యూస్ నమోదు అవుతాయని ఫ్యాన్స్ అంటున్నారు.