SALAAR Vs DUNKI: దిగజారుడు.. సలార్‌పై విషం కక్కుతున్న బాలీవుడ్
డంకీ మూవీ డిసెంబర్ 21న.. ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్నాయి.ఈ రెండు చిత్రాల్లో ఏది అంచనాలను నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి అంతటా నెలకొంది.

SALAAR Vs DUNKI: ఇండియన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద వార్ జరగడానికి సమయం దగ్గర పడుతోంది. సలార్, డంకీ మూవీస్ ఒక్క రోజు గ్యాప్‌లో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఏది అంచనాలను నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి అంతటా నెలకొంది. షారుక్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ 21న.. ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్నాయి.
HanuMan Trailer: వీరంగం.. విజువల్ వండర్ ‘హనుమాన్’..
ఇప్పటికే ఈ చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా సలార్‌పై అప్పుడే విమర్శలు మొదలు పెట్టింది. సలార్ క్రేజ్‌ను బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే తనవంతు విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. డంకీ సినిమాకి నార్త్‌లో ఎక్కువ థియేటర్స్ ఇస్తూ సలార్ సినిమాకి మొండి చెయ్యి చూపిస్తున్నారు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్స్ కూడా డంకీ సినిమాకే కేటాయిస్తున్నారు. బాలీవుడ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. డైనోసార్ వేట ఓ రేంజ్‌లో ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
పైగా బాలీవుడ్‌కు సలార్‌తో తగిన బుద్ధి చెబుతుందని ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ సౌత్ ఇండియాలో పాపులర్ రెబెల్ స్టార్.. నార్త్‌లో షారుక్‌దే పైచేయి. కాగా, వరుస ప్లాపుల్లో ఉన్నపటికీ ప్రభాస్‌కు పాన్ ఇండియా స్టార్‌గా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సలార్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో వేగంగా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘సలార్’ గుర్తింపు తెచ్చుకుంది. ఇలా చూస్తే సలార్.. డంకీపై తన ఆధిక్యతను కనబరుస్తూనే ఉంది.