Salaar Vs Dunki: సలార్ వర్సెస్ డంకీ.. వెనకడుగు వేస్తే రూ.100 కోట్లు..
షారుఖ్ ఖాన్ ఒక అడుగు వేశాడు. అది కూడా ముందుకుకాదు వెనక్కి. ఆ ఒక్క అడుగు ఖరీదు రూ.వంద కోట్లట. అక్కడే చాలా మంది మైండ్ బ్లాంక్ అవుతోంది. అసలే త్రీ ఇడియట్స్, పీకే లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన రాజ్ కుమార్ హీరానీ తీసిన సినిమా.
Salaar Vs Dunki: క్రిస్మస్‌కి సలార్ రిలీజ్ అనగానే డంకీతో పోటీ రిస్క్ అన్నారు. షారుఖ్ ఎంత కింగ్ ఖాన్ అయినా ప్రభాస్ మూమూలువాడు కాదు కాబట్టి, తన సినిమా డంకీకి కూడా ఇది రిస్కీ సీజనే అంటున్నారు. ఈలోపు షారుఖ్ ఖాన్ ఒక అడుగు వేశాడు. అది కూడా ముందుకుకాదు వెనక్కి. ఆ ఒక్క అడుగు ఖరీదు రూ.వంద కోట్లట. అక్కడే చాలా మంది మైండ్ బ్లాంక్ అవుతోంది. అసలే త్రీ ఇడియట్స్, పీకే లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన రాజ్ కుమార్ హీరానీ తీసిన సినిమా.
అందులోనూ పఠాన్, జవాన్ అంటూ రెండుసార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన హిట్లతో దూసుకెళుతున్న షారుఖ్.. ఇలా ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న డంకీ ఫస్ట్ డే కనీసం రూ.100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. అందుకే సలార్ విడుదలయ్యే రోజే డంకీ కాకుండా ఒకరోజు ముందుకి అంటే డిసెంబర్ 21కి ఈ సినిమాను ప్రీ పోన్ చేస్తున్నారట. షారుఖ్ ఎంత సక్సెస్ స్వింగ్ లోఉన్నా, సలార్, డంకీ ఒకేసారి రిలీజ్ అయితే, కనీసం సగం వరకైనా ఓపెనింగ్స్ రెండు సినిమాలకు చీలిపోతాయి. అందుకే ఒకరోజు ముందు డంకీని తీసుకొస్తే, ఓపెనింగ్స్ కనీసం రూ.100 కోట్లు వస్తాయని ఫిల్మ్ టీం భావిస్తోందట.
బిజినెస్‌లో ఈగోలకి ఛోటు లేదు. ఒక పైసా ఎక్కువ వస్తోందంటే, ఆ నిర్ణయానికే నిర్మాతలు కట్టుబడతారు. అందుకే డంకీ రిలీజ్ డేట్ రోజే సలార్ వస్తుంటే, ఈగోకి పోకుండా, వన్ డే బిఫోర్ రిలీజ్‌కి షారుఖ్ టీం సిద్దపడింది.