SALAAR: సలార్‌లో ప్రభాస్ తండ్రి ఎవరు.. డార్లింగ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారా..?

సలార్‌ మూవీలో దేవా తండ్రి పాత్ర పేరు ధారా. ఈ పాత్ర గురించి సినిమాలో ఎక్కడా క్లియర్‌గా చూపించలేదు. ఆ ప్రస్తావన పెద్దగా తీసుకురాలేదు. దీంతో సినిమా మొత్తం పూర్తయిపోయినా.. దేవా తండ్రి ఎవరు అనేది తెలియలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 01:49 PMLast Updated on: Dec 27, 2023 | 1:50 PM

Salaar Who Is The Father Of Prabhas In Salaar

SALAAR: సలార్‌ రిలీజ్‌ ముందు జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఒక్క లీక్ కూడా లేకపోవడంతో.. సలార్‌కు సంబంధించి ఎవరి కథ వారు రాసేసుకున్నారు. సలార్‌ ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని.. రెండో భాగంలో తండ్రి పాత్రలో డార్లింగ్‌ కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కొడుకు దేవా అయితే, తండ్రి సలార్‌ అని ఎవరికి వారు ఊహించేసుకున్నారు. ఐతే రిలీజ్‌ తర్వాత సీన్ మారిపోయింది. ఆ ఇద్దరూ ఒకటేనని.. తండ్రి పాత్ర ఇంకొకటి ఉందని తేలిపోయింది.

Telangana Covid Cases: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కోవిడ్ కేసులు దాస్తున్న వైద్యశాఖ..!

అయితే ఆ తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేశారన్న ఆసక్తి ఇప్పుడు ఫ్యాన్స్‌లో మొదలైంది. సెకండ్‌ పార్ట్‌ మీద ఇదే క్యూరియాసిటీ పెంచుతోంది. సలార్‌ మూవీలో దేవా తండ్రి పాత్ర పేరు ధారా. ఈ పాత్ర గురించి సినిమాలో ఎక్కడా క్లియర్‌గా చూపించలేదు. ఆ ప్రస్తావన పెద్దగా తీసుకురాలేదు. దీంతో సినిమా మొత్తం పూర్తయిపోయినా.. దేవా తండ్రి ఎవరు అనేది తెలియలేదు. ఇప్పుడు సినిమా టీమ్‌.. ఓ పోస్టర్‌ విడుదల చేసింది. సలార్‌ తండ్రి ఎవరు అవ్వొచ్చు అనే ప్రశ్న వేసింది. దీంతో సోషల్‌ మీడియాలో రకరకాల ఆన్సర్లు వస్తున్నాయ్. ఐతే ఎక్కువమంది మాత్రం అది కూడా ప్రభాసే అంటున్నారు. సలార్‌ టీమ్‌ రిలీజ్‌ చేసిన పోస్ట్‌లో చాలా విషయాలు హైలైట్ చేస్తున్నారు నెటిజన్లు. కోర మీసంతో, ఆ మనిషి అచ్చంగా ప్రభాస్‌‌లానే ఉన్నాడని కొందరు.. అంతేకాకుండా ఆ పాత్రకు మరొకరిని తీసుకుంటే ఆ రేంజిలో పండకపోవచ్చు అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఐతే ఇవన్నీ తేలాలంటే.. సలార్‌ శౌర్యాంగ పర్వం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అంతకంటే ముందు ఆ సినిమా షూటింగ్‌ పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఫుటేజ్‌ ఉంది, ఎంత షూటింగ్‌ చేయాలి అనేది కూడా తెలియాలి. ఈ విషయంలో టీమ్‌ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేదు. ఎలాంటి సమాచారమూ లేదు. ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా వెయిట్‌ చేస్తున్న రికార్డు వసూళ్లను సలార్‌ అందించింది. దీంతో ఆ రెండో భాగం కూడా వచ్చి అదరగొట్టాలని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.