Prabhas : స్పిరిట్ టార్గెట్‌గా సలార్ 2…

ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు మారుతి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 11:15 AMLast Updated on: Apr 21, 2024 | 11:15 AM

Salar 2 As Spirit Target

ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు మారుతి. ఇప్పటికే రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ లుక్‌తో పాటు.. లీక్డ్ లుక్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి.

ఇక రాజాసాబ్ షూటింగ్ తర్వాత సలార్ 2 (Salaar 2) మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. కానీ మధ్యలో కల్కి ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. మే లేదా జూన్ ఎండింగ్‌లో కల్కి రిలీజ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే శౌర్యాంగ పర్వం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాను స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేలోపు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ మూవీ ఈ ఇయర్ ఎండింగ్‌లో సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో.. జూన్‌ లేదా జూలైలో సలార్ షూటింగ్ మొదలు పెట్టి.. నవంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నారట.

ఇప్పటికే సలార్ ఫస్ట్ పార్ట్‌తో పాటు పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యిందట. దీంతో.. ఆరు నెలలు డెడ్‌లైన్‌గా పెట్టుకొని సలార్ 2లో ప్రభాస్‌ పోర్షన్‌ మొత్తం కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashant Neil) ‘సలార్ 2’ పనులతో బిజీగా ఉండగా.. సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. సలార్ 2 కంప్లీట్ అయ్యేలోపు.. అన్నికంప్లీట్‌ చేసి డిసెంబర్‌లో ‘స్పిరిట్‌’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. స్పిరిట్‌, హను మూవీలను పారలల్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట డార్లింగ్‌. అయితే.. ఈ మధ్యలో కల్కి రిజల్ట్‌ను బట్టి పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. ఈ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యారెంటీ