Salar 2 : సెట్స్ పైకి స‌లార్‌-2… హింట్ ఇచ్చిన ఆ ఇద్దరు

రెబ‌ల్ స్టార్ (Rebel Star) ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన స‌లార్ వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 715కోట్ల రూపాయల గ్రాస్‌ని వసూలు చేసింది. ప్రభాస్‌ స్టామినాను మరోసారి రుజువు చేసింది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్ర‌భాస్‌కు స‌లార్ భారీ ఊరటను ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2024 | 11:00 AMLast Updated on: Mar 12, 2024 | 11:00 AM

Salar 2 Up The Sets Those Two Who Gave The Hint

 

 

 

రెబ‌ల్ స్టార్ (Rebel Star) ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన స‌లార్ వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 715కోట్ల రూపాయల గ్రాస్‌ని వసూలు చేసింది. ప్రభాస్‌ స్టామినాను మరోసారి రుజువు చేసింది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్ర‌భాస్‌కు స‌లార్ భారీ ఊరటను ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది రిలీజై భారీ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ప్రభాస్​ను అభిమానులు చూడాలనుకునే విధంగా ఊరమాస్ అవతార్​లో చూపించాడు నీల్.. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద డార్లింగ్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ పార్ట్​ గ్రాండ్​ సక్సెస్​ అవడంతో ‘సలార్ 2’ మీద ఎక్స్​పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. అయితే.. ప్ర‌జెంట్ ప్ర‌భాస్ చేతిలో వ‌రుస సినిమాలు ఉండ‌డంతో.. స‌లార్ -2 (Salaar 2) లేట్ అవుతుంద‌న్న టాక్ వినిపించింది. అయితే.. స‌లార్‌-2 గురించి వ‌చ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది.

‘సలార్‌’ లో కీలక పాత్రలు పోషించిన నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బాబీ సింహా విడివిడిగా ఆ ప్రశ్నకు సమాధానాలు ఇచ్చేశారు. స‌లార్ రెండో భాగం షూటింగ్ త్వ‌ర‌లోనే మొదలు కానుందని పృథ్వీరాజ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రశాంత్‌నీల్‌ దాదాపు పూర్తి చేశాడ‌ని క్లారిటీ ఇచ్చాడు. అలాగే న‌టుడు బాబీసింహా కూడా ఓ ఇంటర్వ్యూలో స‌లార్ పార్ట్ -2 పై హింట్ ఇచ్చేశాడు. ఓ అడుగు ముందుకేసి వ‌చ్చే నెల‌ల‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుందంటూ ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చాడు. దీంతో.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

అటు పృథ్వీరాజ్, ఇటు బాబీ సింహా మాటల్ని బట్టి ‘సలార్’ సీక్వెల్ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, పార్ట్​-2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో తెరకెక్కించనున్నారు. ఫస్ట్ పార్ట్​లో ప్రశ్నలుగా మిగిలిన వాటికి సీక్వెల్​లో సమాధానాలు ఇవ్వనున్నాడు నీల్.. ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898’ (Kalki 2898) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కాబోయే ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. మ‌రోవైపు మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ కూడా ఈ ఏడాదినే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి స‌లార్‌-2 పై వ‌చ్చిన లేటెస్ట్ అప్‌డేట్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుంది.