Salar2 : స‌లార్‌-2మెంట‌ల్ ఎక్కించ‌డం ఖాయ‌మంట‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ (Young Rebel Star) ప్ర‌భాస్ (Prabhas)న‌టించిన స‌లార్ పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ (Director Prashant Neel) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.. కేజీఎఫ్ రేంజ్‌ను అందుకోన‌ప్ప‌టికీ.. ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి.. ప్ర‌భాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2024 | 09:40 AMLast Updated on: Mar 17, 2024 | 10:05 AM

Salar 2mental Uploading Is Certain

యంగ్ రెబ‌ల్ స్టార్ (Young Rebel Star) ప్ర‌భాస్ (Prabhas)న‌టించిన స‌లార్ పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ (Director Prashant Neel) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.. కేజీఎఫ్ రేంజ్‌ను అందుకోన‌ప్ప‌టికీ.. ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి.. ప్ర‌భాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఫ్యాన్స్‌తో యాక్ష‌న్ మూవీస్ ల‌వ‌ర్స్‌కు మంచి ఫుల్ మీల్స్ పెట్టింది. మొత్తానికి స‌లార్-1 భారీ హిట్‌తో.. స‌లార్‌-2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. శౌర్యంగ ప‌ర్వంగా తెరకెక్క‌నున్న ఈ మూవీ కోసం ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పుడు దీనిపై న‌టుడు బాబీసింహా చేసిన హాట్‌టాపిక్‌గా మారాయి.

సలార్ 1 చూసిన వారికి ఎన్నో ప్రశ్నలు బ్యాలెన్స్ ఉంచాడు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్.. వాటన్నింటికి సలార్‌ 2 లో సమాధానాలు లభించబోతున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వ‌ర‌స‌గా వ‌స్తున్న అప్‌డేట్స్, హింట్స్ ఈ మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా సలార్‌ లో శౌర్యంగ గా కనిపించిన బాబీ సింహా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సలార్‌ 1 క్లైమాక్స్ లో ఎలాంటి గూజ్‌ బంప్స్ సన్నివేశాలు ఉన్నాయో.. సలార్‌ 2 లో అంతకు మించి అన్నట్లుగా ఉంటాయ‌ని చెప్పేశాడు.. సలార్ శౌర్యంగ పర్వం లో వంద రెట్లు అధికంగా గూజ్ బంప్స్ వచ్చే విధంగా సన్నివేశాలు ఉంటాయన్నాడు. ముఖ్యంగా సలార్ 2 క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలా సర్‌ప్రైజింగ్ గా ఉంటుందంటూ స‌లార్‌-2 హీట్‌ను పెంచేశాడు. సలార్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ బాబీ సింహా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సలార్ 1 లో బాబీ సింహా రోల్ ఉన్న కొద్దిసేపైనా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే సలార్ 2లో అతని పాత్ర మరింత బలంగా ఉంటుందని తెలుస్తుంది. సలార్ 2 కథలో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వైరాన్ని చూపించబోతున్నారు. సలార్ 1 లో బాబీ సింహా రోల్ ఉన్న కొద్దిసేపైనా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే సలార్ 2లో అతని పాత్ర మరింత బలంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక‌..ప్ర‌భాస్ ప్రస్తుతంకల్కి 2898 AD సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ సినిమాను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు. రాజా సాబ్ తర్వాత సలార్ 2 నే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. సో.. బాబీ సింహా కామెంట్స్ ని బట్టి చూస్తే.. ప్రభాస్ సలార్ 2 తో మెంటల్ ఎక్కించేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స‌యిపోయారు.