సలార్ కలెక్షన్స్.. అది రీ రిలీజ్ అని ఎవరైనా చెప్పండ్రా వాళ్లకు.. అన్ని కోట్లేంటి స్వామి..?

రీ రిలీజ్ అంటే కనీసం 10 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ చేస్తే మళ్లీ వెళ్లి థియేటర్లో చూస్తున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. అరే నిన్న గాక మొన్న..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 01:00 PMLast Updated on: Mar 22, 2025 | 1:00 PM

Salar Collections Thats A Re Release

రీ రిలీజ్ అంటే కనీసం 10 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ చేస్తే మళ్లీ వెళ్లి థియేటర్లో చూస్తున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. అరే నిన్న గాక మొన్న.. ఏడాదిన్నర కింద వచ్చిన సినిమాను కూడా మళ్లీ విడుదల చేస్తే అదే రేంజ్ లో థియేటర్లకు పోటెత్తుతున్నారు అంటే ఏమనుకోవాలి..? తాజాగా సలార్ సినిమా విషయంలో ఇదే జరిగింది. 2023 డిసెంబర్లో ఈ సినిమా విడుదలై దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ కు సరిపోయే సరైన మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో సలార్ అందరికీ చూపించింది. కంటెంట్ రొటీన్ గానే ఉన్నా కేవలం రెబల్ స్టార్ కటౌట్ ఈ సినిమాను 600 కోట్ల వరకు తీసుకెళ్లింది. అదే సినిమాతో పాటు విడుదలైన షారుక్ ఖాన్ డంకీ జాడ కూడా కనిపించలేదు. వరుసగా రెండు 1000 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోను కూడా తన స్టామినాతో మడత పెట్టాడు ప్రభాస్.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. ఈ సినిమాను మరోసారి మార్చి 21న విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వచ్చి ఏడాది కదా అయింది ఇప్పుడు ఎవరు చూస్తారులే అనుకున్నారు కానీ రీ రిలీజ్ సినిమాలలో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. కాటేరమ్మ కొడుకుని మరోసారి చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు ఫాన్స్. హైదరాబాదులో అయితే ఏకంగా 1000 షోలకు పైగా పడ్డాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సలార్ సినిమా క్రేజ్ ఎలా ఉందో..! అసలు ఈ రోజు విడుదలైన కొత్త సినిమాలు కంటే ప్రభాస్ పాత సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొదటిరోజు బుక్ మై షో లో దాదాపు 90 వేల టికెట్లు బుక్ అయ్యాయి అంటే సలారోడి ప్రభంజనం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 2500 షోలు వేశారు. మన దగ్గర మాత్రమే కాదు బెంగుళూరు, ముంబై లాంటి ప్లేసెస్ లో కూడా ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు.

అక్కడ కూడా చాలా వరకు టికెట్స్ ఫుల్ అయిపోయాయి. దీన్నిబట్టి ప్రభాస్ ఏ రేంజ్ లో థియేటర్ల మీద దండెత్తాడు అనేది అర్థమవుతుంది. అయినా కొత్త సినిమాలకు కోట్ల కలెక్షన్స్ వస్తే ఎవరూ అడగరు కానీ.. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలను కూడా ప్రేక్షకులు ఈ రేంజ్ లో ఆదరిస్తున్నారు అంటే మన వల్ల సినిమా పిచ్చికి నిజంగా దండేసి దండం పెట్టాలి. రీ రిలీజ్ లో సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 3 కోట్లకు పైగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. అందులో 1.70 కోట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వచ్చాయి. ఒకవైపు మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలవుతున్నా కూడా.. హైదరాబాద్ లో చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. సలార్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసాక.. సాహోని కూడా రీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.