Salar : స‌లార్ ఫ‌స్ట్ రివ్యూ.. పూనకాలే

‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్ ’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్ తో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. అంతలోనే సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతారంలో కనిపిస్తాడట. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ను వేరే లెవల్లో చూపించాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 02:51 PMLast Updated on: Dec 20, 2023 | 2:51 PM

Salar First Review Poonakal

 

‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్ ’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్ తో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. అంతలోనే సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతారంలో కనిపిస్తాడట. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ను వేరే లెవల్లో చూపించాడట. ప్రభాస్ ఎంట్రీనే మూవీలో ఓ అద్భుతం. సినిమా ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీన్స్ , ఛేజింగ్ సీన్స్ అబ్బురపరుస్తాయని ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చాడు.

సలార్ ఫుల్ పైసా వసూల్ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా స్టైలిష్‌గా చూడబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాక సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడని.. ఆ రోల్‌లో ప్రభాస్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ‘సలార్’హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. బాక్స్ ఆఫీస్ బ్లాక్‌బస్టర్ సలార్ ఎన్నో రికార్డులను చెరిపేస్తుందని హైప్ క్రియేట్ చేశాడు.

ఇక చెప్పాలంటే సలార్ ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ. ఇంతకు ముందెన్నడూ చూడని రోల్‌లో ప్రభాస్ చెలరేగిపోయాడు. స్క్రీన్ మీద స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్‌ మాత్రమే బాస్ అనే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని ఉమేర్ సంధూ తెలిపాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్‌ను మించిన మాస్ హీరో లేడని సలార్ సినిమాతో మరోసారి యంగ్ రెబల్ స్టార్ నిరూపించాడు. శృతి గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో కూడా కుమ్మేసిందన్నారు. తెర మీద శృతిహాసన్ స్టన్నింగ్‌గా కనిపించిందన్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ నటన పక్కన పెడితే.. ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ మాత్రం ఫుల్ షాకింగ్‌గా ఉంటుందని పూనకాలు తెప్పించాడు.