Salar storySalar story leakedసలార్ స్టోరీ లీక్.. సలార్ కథ ఇదేనా..? leaked
సలారోడు బాక్సాఫీస్ ఊచకోతకు రెడీ అయ్యాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'సలార్' సినిమా రేపు(డిసెంబర్ 22న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Salar story leaked.. Is this the story of Salar..?
సలారోడు బాక్సాఫీస్ ఊచకోతకు రెడీ అయ్యాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సలార్’ సినిమా రేపు(డిసెంబర్ 22న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ తో సలార్ ని రూపొందించినట్లు ఇప్పటికే మూవీ టీం తెలిపింది. శత్రువులుగా మారిన స్నేహితులుగా ప్రభాస్, పృథ్వీరాజ్ కనిపించనున్నారు. దీంతో వారు అసలు శత్రువులుగా ఎందుకు మారారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీరు శత్రువులుగా మారడానికి కారణం శృతి హాసన్ పాత్ర అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయి అన్నట్టుగా.. శృతి హాసన్ వల్ల వీరి స్నేహం శత్రుత్వంగా మారుతుందట.
ప్రభాస్ ప్రేయసి శృతి హాసన్ పై పృథ్వీరాజ్ మనసు పడటంతోనే ఈ కథ అడ్డం తిరుగుతుందని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ.. ఈ కథ నిజమైతే మాత్రం ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘బాహుబలి’లో సైతం అన్నదమ్ముల మధ్య శత్రుత్వం పెరగడానికి.. అనుష్క పాత్ర కారణం కావడం విశేషం. మరి సలార్ నిజంగానే ఒక స్త్రీ కారణంగా శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా వస్తుందా లేక ఏదైనా కొత్త పాయింట్ తో వస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.