Salman Khan: మహిళల డ్రెస్సింగ్‌పై సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సల్మాన్ ఖాన్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తోచ్చేది ఆయన మజిల్డ్ బాడీ. మాట మాట్లాడితే షర్ట్ విప్పేస్తాడు. దాదాపు సగం సినిమా అంతా షర్ట్ లేకుండానే చేస్తాడు. అలాంటి సల్మాన్ ఖాన్ రీసెంట్‌గా అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తన సెట్ ఉండే అమ్మాయిలంతా పొట్టి బట్టలు వేసుకుంటే తనకు నచ్చదని చెప్పాడు. సినిమాల్లో క్యారెక్టర్ కోసం ఓకే.. కానీ సెట్‌లో కూడా అలాంటి బట్టలు వేసుకుని కనిపిస్తే వెంటనే సల్మాన్ క్లాస్ తీసుకుంటాడట. మెడ వరకూ కవర్ చేసే బట్టలు వేసుకునేలా ఎంకరేజ్ చేస్తాడట. తన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు మాగ్జిమం అలాంటి బట్టలు వేసుకునేలానే జాగ్రత్తలు తీసుకుంటాడట. అయితే కొందరు మాత్రం మీరెందుకు షర్ట్ విప్పి సాంగ్స్ ఫైట్స్ చేస్తున్నారంటూ క్వశ్చన్ చేశారు.
దీంతో రెండిటిని లింక్ చేయొద్దని చెప్పాడు సల్మాన్. మగ వారితో కంపేర్ చేస్తే ఆడవాళ్ల శరీరాలు చాలా విలువైనవి.. అలాంటి శరీరాలను మాగ్జిమం మంచి బట్టలతో కవర్ చేయాలంటూ చెప్పాడు. ప్రతీ అమ్మాయిలో సెక్సువల్ యాంగిల్ చూసే వాళ్ల నుంచి కాపాడుకునేందుకు ఇదే మంచి మార్గమంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రతీ ఒక్కరు పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిన చూస్తే ఏ ప్రాబ్లం లేదు. కానీ మనచుట్టు ఉన్న చాలా మందిలో అలాంటి వాళ్లు లేరు కాబట్టే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు.
సల్లూభాయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తుంటే కొందరు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా భాయ్ చెప్పినదాంట్లో కూడా మ్యాటర్ ఉంది.