Salman Khan: ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న సల్మాన్ కామెంట్స్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కంగారు పెరిగింది. తమ అభిమాన హీరోకి సల్మాన్ మాటలు తూటాల్లా తగులుతున్నాయనే బాధ కనిపిస్తోంది. ఇక్కడ సల్మాన్ ఖాన్ ప్రభాస్ మీదా ఎలాంటి కామెంట్ చేయలేదు. కాని తన కామెంట్స్ పరోక్షంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి.

Prabhas Fance Fear About His marriage
సల్మాన్ వయసు 57 సంవత్సరాలు.. అంటే మరో 3 ఏళ్లు నిండితే తనకు షష్టి పూర్తే.. ఇలాంటి టైంలో మొన్నా మధ్య ఓ ఫారెన్ జర్నలిస్ట్ మీ పెల్లెప్పుడు అంటూనే తనని పెళ్లి చేసుకుంటావా అంటే, 20 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న వేస్తే బాగుండు. ఇప్పుడు వయసైపోయిందన్నాడు.
ఇది అచ్చంగా ప్రభాస్ కి సూట్ అయ్యేలా ఉంది. ప్రభాస్ వయసు 43 సంవత్సరాలు.. తనకి మరో 17 ఏళ్ల తర్వాత 60 నిండుతాయి. ఇప్పుడే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి.. లేదంటే ఇలానే డిలే చేస్తూ పోతే, సల్మాన్ అన్నట్టు 55 ఏళ్లకో 60ఏళ్లకో పెళ్లి చేసుకోవాలనుకున్నా, 20 ఏళ్ల క్రితమే ఆ పనిచేస్తే బాగుండు అనుకునే పరిస్థితి ఎదురౌతుంది. సో సల్మాన్ చేసిన తప్పే చేయకుండా, ప్రభాస్ ఇంకా నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది.