Salman Khan: సల్మాన్ ఖాన్ మరీ ఇంత పిరికి హీరోనా.. అతి ఘోరమైన తప్పు!

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీని సౌత్, నార్త్ అంతా రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ సింగిల్ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. అంటే ఇక్కడి జనం తన సినిమాకు ప్రమోషన్ చేయకున్నా క్యూ కట్టేస్తారనే అతి విశ్వాసమా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2023 | 06:57 PMLast Updated on: Apr 20, 2023 | 6:57 PM

Salman Khan Not Promoted Kisi Ka Bhai Kisi Ki Jaan In South And North This Is The Reason

Salman Khan: సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ఎంత తోపు స్టార్ అయినా, టాలీవుడ్‌లో తనకి అంత మార్కెట్ లేదు. అయినా కాని కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీని సౌత్, నార్త్ అంతా రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ సింగిల్ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. అంటే ఇక్కడి జనం తన సినిమాకు ప్రమోషన్ చేయకున్నా క్యూ కట్టేస్తారనే అతి విశ్వాసమా?

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో సల్మాన్ హీరో అయినా, సపోర్టింగ్ హీరోగా వెంకటేష్ నటించాడు. హీరోయిన్ పూజా హెగ్డే. ఇక విలన్‌గా జగపతి బాబు, అలానే గెస్ట్ రోల్‌లో రామ్ చరణ్ నటించాడు. అంటే అంతా తెలుగు వాళ్లే ఉన్నారు. కాబట్టి ప్రమోషన్ లేకుండానే ఇక్కడ హిట్ అవుతుందనేది సల్మాన్ అతి విశ్వాసమా? లేదంటే పఠాన్‌ని ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేసి షారుఖ్ ఎలా అయితే 1000 కోట్లు రాబట్టాడో, అదే రూట్లో సల్మాన్ వెళ్తున్నాడా? ఈ డౌట్లకి గేట్లేసే రీజన్ మరోకటి ఉంది. సల్మాన్ సౌత్‌లోనే కాదు.. నార్త్‌లో కూడా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ప్రమోషన్ చేయలేదు.

కారణం సల్మాన్‌ని చంపేస్తాం అంటూ ఇటీవల వరుసగా బెదిరింపు కాల్స్ రావటమే. రీసెంట్‌గా కూడా సల్మాన్‌ని వేసేస్తామంటూ కాల్ రావటం వల్లే తను ఎక్కడా సినిమా ప్రమోషన్‌కి వెళ్లట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఆడుతుందా అంటే.. ఇది మరో పఠాన్ అనలేం. ఎందుకంటే ఇది కాటమరాయుడు రీమేక్ కాబట్టి.