అమెరికా వెళ్ళిపోతున్న సల్మాన్…?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ భయం ఉంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ భయం ఉంది. దీని నుంచి బయటపడటానికి సల్మాన్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ సీరియస్ గానే టార్గెట్ చేసిందనే విషయం ఇటీవల ప్రూవ్ అయింది. మాజీ మంత్రి, సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్… బాబా సిద్దిఖీని కాల్చి చంపేశారు.
దీనితో సల్మాన్ ఖాన్ కు భయం మొదలయింది. బాబా సిద్దిఖీకి నివాళులు అర్పించడానికి వచ్చిన సమయంలో కూడా సల్మాన్ ఖాన్ ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడలేదు. ఇక బిగ్ బాస్ షో కి హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు… తప్పుకునే ఆలోచనలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. షోలో ఇటీవల తన ఫ్రస్ట్రేషన్ మొత్తం సల్మాన్ ఖాన్ బయటపెట్టాడు. ఈ షోకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ అయింది. అసలు తనకు రావడం ఇష్టం లేకపోయినా వచ్చా అంటూ చెప్పుకొచ్చాడు.
కేవలం తనకు రావాల్సిన బాధ్యత, నిబద్దత ఉన్నాయి కాబట్టే వచ్చా అని తెలిపాడు. బిగ్ బాస్ సెట్ లో కూడా భారీగా భద్రతను పెంచారు. అయినా సరే సల్మాన్ ఖాన్ కు ప్రాణ భయం పీక్స్ లో ఉంది అనే విషయం అర్ధమవుతోంది. వై కేటగిరి భద్రతను కేంద్రం కల్పించినా బాబా సిద్దిఖీని చంపారు. అదే భద్రత సల్మాన్ కు ఉంది. దీనితో సల్మాన్ వ్యక్తిగతంగా కూడా భద్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బులెట్ ప్రూఫ్ కార్ ని కూడా కొనే ఆలోచనలో ఉన్నాడని, దుబాయ్ నుంచి బులెట్ ప్రూఫ్ కార్ ని తెస్తారని ప్రచారం జరిగింది .
అయినా సరే సల్మాన్ ను వదిలే అవకాశం కనపడటం లేదని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. దీనితో సల్మాన్ ఖాన్ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అయితే కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు బలమైన టీం ఉంది. ఆ భయం కూడా సల్మాన్ కు ఉంది. దీనితో ఎక్కడ ఉంటే సేఫ్ అనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పడం లేదంటే… కొన్నాళ్ళు ఇండియాలో ఉండి షూట్ చేసుకుని వెళ్ళిపోవడం వంటివి చేయాలని భావిస్తున్నాడు.