Samajavaragamana: సామజవరగమన మూవీ రివ్యూ.. శ్రీ విష్ణు హిట్ కొట్టాడా..? లేదా..?
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజరగమన సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. రొటీన్‌కు భిన్నంగా ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేసింది సినిమా.
Samajavaragamana: చెప్పుకునేందుకు పెద్ద హిట్ ఏదీ లేకపోయినా మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. పెద్ద సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజరగమన సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. రొటీన్‌కు భిన్నంగా ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేసింది సినిమా.
ఈ సినిమాలో హీరో తండ్రి డిగ్రీ పాసయ్యేందుకు 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకంటే డిగ్రీ పాసైతేనే ఆస్తి దక్కేలా ఆయన తండ్రి వీలునామా రాసి చనిపోతాడు. దీంతో ఆయన డిగ్రీ పాసయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. తండ్రిని డిగ్రీ పాస్ చేయించేందుకు హీరో ట్యూషన్లు చెప్తూ కష్టపడుతుంటాడు. ఇదే సమయంలో హీరోయిన్ హీరో ఇంట్లో పెయింగ్ గెస్ట్‌గా వస్తుంది. హీరోయిన్ కూడా డిగ్రీ సప్లీలు రాసుకునే యావరేజ్ స్టూడెంట్. కొన్నాళ్లకు హీరోహీరోయిన్ మధ్య ప్రేమ మొదలవులుతంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అప్పుడే హీరో వాళ్ల అత్తయ్య కొడుక్కి హీరోయిన్ అక్కతో పెళ్లి జరుగుతుంది. దీంతో హీరోయిన్ హీరోకు చెల్లెలు ఐపోతుంది. దీంతో వాళ్ల లవ్ స్టోరీ మొత్త తలకిందులు అవుతుంది. ఇంట్లో వాళ్లను ఒప్పించేందుకు హీరో హీరోయిన్ ఏం చేశారు. హీరో తన తండ్రిని డిగ్రీ ఏలా పాస్ చేయించాడు అనేది మిగతా కథ. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అనే చెప్పాలి.
కథ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించాడు. సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిశోర్ కామెడీ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. హీరో హీరోతండ్రి మధ్య సీన్స్‌కు ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ల్యాగ్‌గా అనిపించినా సినిమా చాలా బాగుంది. ఇలాంటి టైంలో కాకుండా పండగ సీజన్‌లోనో సెలవులు ఉన్న టైంలోనో ఈ సినిమా వచ్చి ఉంటే మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఓవరాల్‌గా సామజవరగమనతో ఓ మంచి ఫ్యామిలీ, ఫన్ సినిమాను అందించాడు డైరెక్టర్ రామ్ అబ్బరాజు.