Samantha and Naga Chaitanya: వైరల్‌గా మారిన సమంత ఇన్‌స్టా పోస్ట్.. చై,సామ్ మళ్లీ కలిసిపోతారా..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా సమంత, నాగచైతన్య ఉండేవాళ్లు. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. కానీ కొంత కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

Samantha Naga Chaitanaya Comments viral on Social Media
అప్పటి నుంచి ఎవరి లైఫ్ వాళ్లది. ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ ఎలాంటి కామెంట్స్ చేసుకోలేదు. కానీ రీసెంట్‌గా కస్టడీ సినిమా ప్రమోషన్స్‌లో నాగ చైతన్య సమంత గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. సమంత చాలా మంచి వ్యక్తి అని. తనతో గడిపిన జీవితానికి చాలా వాల్యూ ఇస్తానంటూ చెప్పాడు. సమంత ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు.
చై చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. చైతన్య ఈ కామెంట్స్ చేసిన నెక్స్ట్ డేనే సమంత ఇన్‌స్టాగ్రాంలో ఓ స్టోరీ పెట్టింది. మనమంతా ఒక్కటే.. కానీ ఇగో, తప్పుడు నమ్మకాలు, భయాలు ఇవే మనల్ని విడదీశాయి అంటూ స్టోరీ పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. చై కామెంట్స్‌కు రియాక్షన్‌గా సమంత ఈ పోస్ట్ పెట్టిందంటున్నారు నెటిజన్లు. దీంతో కొత్త చర్చ ఊపందుకుంది. ఇద్దరి అభిప్రాయాలూ ఒకేలా ఉన్నాయి. త్వరలోనే వీళ్లు మళ్లీ కలిసిపోతారంటున్నా ఫ్యాన్స్. సమంత గురించి నాగ చైతన్య పాజిటివ్‌గా మాట్లాడటం.. సమంత పెట్టిన స్టోరీ కూడా దానికి రిలేటెడ్‌గా ఉండటంతో వాళ్లు కలిసిపోవడం పక్కా అంటున్నారు.