Samantha and Vijay Devarakonda: ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. లిరిక్స్‌తో మనసుకు హత్తుకున్నారుగా..
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా మూవీలోని ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజెస్‌లో కూడా ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
నా రోజా నువ్వే అంటూ సాగే సాంగ్‌కి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ రాశాడు. సంగీత దర్శకుడు అబ్దుల్ వహాబ్ స్వయంగా ఈ సాంగ్ పాడాడు. ఇక సాంగ్ మొత్తం కాశ్మీర్ లోయల్లో కథ వెనుక సాగుతుంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా కనిపించింది. సాంగ్‌లో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాటోగ్రహీ ఈ సాంగ్‌కు చాలా ప్లస్ అయింది.
ఈ సాంగ్‌ని బట్టి చూస్తుంటే సినిమా ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతుని ఇవ్వబోతోందని తెలుస్తుంది. ఇక లైగర్‌తో విజయ్‌కి పాన్ ఇండియా సక్సెస్ మిస్ అయ్యింది. ఈ సినిమాతో ఆ ముచ్చటని తీర్చుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. శివ నిర్వాణ లవ్ మూవీస్‌ని చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కిస్తాడని ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. ఆయన డైరెక్సన్‌లో వచ్చిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు ప్రేక్షకుల మనసుని హత్తుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. ఈ మధ్య కాలంలో సమంతకి కూడా సరైన విజయం లేదు. మరి దర్శకుడు వీళ్లిద్దరికీ మంచి విజయాన్ని అందించి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా? లేదా? చూడాలి.