Samantha: చేయని తప్పు.. జబ్బు వల్ల 35 కోట్లు లాస్..
సమంత రూత్ ప్రభు సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఏడాది బ్రేక్ తీసుకుని వస్తా అంది.. సరే ఏదో రెస్ట్ తీసుకుంటోంది కదా, ఆరోగ్యం కుదుట పడ్డాక తిరిగొస్తుందనుుంటో, ఊహించని ట్విస్ట్ తనకి 35 కోట్ల వరకు లాస్ వచ్చింది.

Samantha cancels all her shoots due to myositis and returns the advances
మొన్నే ముంబైలో ఫ్లాట్ కొని మళ్లీ అమ్మేసిన సమంత, ఇప్పడు 35 కోట్ల నష్టంతో ఇంకాస్త డీలా పడిందట. కారణం మాత్రం తన అనారోగ్యమే అంటున్నారు. మయో సైటిస్ తో పోరాడి గెలిచి, ఖుషీమూవీ షూటింగ్ పూర్తి చేసింది సమంత. తర్వాత హిందీ వెబ్ సీరీస్ సీటా డెట్ షూటింగ్ కూడా పూర్తి చేసింది.
కమిటైన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన సమంత కూల్ గా రిలాక్స్ అవుదామంటే 35 కోట్ల లాస్ షాక్ తనని బాధపెడుతోంది. గతంలో కమిటైన సినిమాల అడ్వాన్సులు తిరిగి ఇవ్వటం, తను పెట్టుబడి పెట్టిన ప్లాట్ ధర తగ్గడం, అవసరం కోసం దాన్ని అమ్మాల్సి రావటం వల్ల, ఇలా జరగటం మొత్తంగా తను 35 కోట్లు నష్టపోతోందట. ఇక తనకి అందివచ్చిన మూడు సినిమాలు కాదనటం వల్ల కూడా మరో 10 కోట్లు నష్టపోవాల్సి వస్తోందట. మొత్తంగా 45 కోట్ల వరకు లాస్ అయినట్టే అని తెలుస్తోంది.