Spl fouce వాళ్లు నిన్ను వదిలేసారు..! నువ్వే వాళ్ళని వదలట్లేదు..! ఎందుకు సామ్ ఈ ఆరాటం?
శరీరానికైన గాయం మానుతుందేమో గాని మనసుకు తగిలిన గాయం మానడానికి జీవితం సరిపోదు. అందమైన జ్ఞాపకాలు మనను విడిచి వెళ్ళినా... చేదు జ్ఞాపకాలు జీవితం మొత్తం వెంటాడుతూనే, మన జీవితాన్ని ఆవహించి, మన శక్తిని, మన మనోధైర్యాన్ని, మన ఆత్మ విశ్వాసాన్ని నిత్యం దహించి వేస్తూనే ఉంటాయి.
శరీరానికైన గాయం మానుతుందేమో గాని మనసుకు తగిలిన గాయం మానడానికి జీవితం సరిపోదు. అందమైన జ్ఞాపకాలు మనను విడిచి వెళ్ళినా… చేదు జ్ఞాపకాలు జీవితం మొత్తం వెంటాడుతూనే, మన జీవితాన్ని ఆవహించి, మన శక్తిని, మన మనోధైర్యాన్ని, మన ఆత్మ విశ్వాసాన్ని నిత్యం దహించి వేస్తూనే ఉంటాయి. ఇది సమంతా విషయంలో నూటికి కోటి శాతం అక్షరాలా నిజం. అమ్మాయిలు ప్రేమిస్తే త్వరగా మర్చిపోతారు, అబ్బాయిలు మర్చిపోవడానికి జీవితం సరిపోదు అనే ఒక ఫిలాసఫీ వింటూ ఉంటాం.
కానీ సమంతా విషయంలో మాత్రం అది కంప్లీట్ గా డిఫరెంట్. ఒక వ్యక్తిని ప్రేమించింది, ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంది, తన అభిరుచులను అతని కోసం దూరం చేసుకుంది. కానీ అతనికి దూరమైన తర్వాత… అతని జ్ఞాపకాలను మాత్రం ఆమె దూరం చేసుకోవడానికి కష్టపడుతూనే ఉంది. ఎవరితో పంచుకోలేక సోషల్ మీడియాలో తన హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ తన బాధను, తన ఆవేదనను, తాను కార్చిన కన్నీళ్లను సమాజానికి చెప్పే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంది. తన జీవితంపై వేసి ఓ కాల్చిన గుడ్డ అవశేషాలను తుడుచుకోవడానికి నిత్యం కష్టపడుతూనే ఉంది.
తన మాజీ భర్త నిశ్చితార్ధం అయిన తర్వాతి నుంచి తన బాధను మరింతగా బయటపెడుతూ వస్తోంది సమంతా. “చాలా మంది వ్యక్తులు స్నేహం, రిలేషన్ షిప్ ను కలిపి చూస్తారు. ఎస్ నేను అంగీకరిస్తున్నాను. ప్రేమను మీరు ఇచ్చారు, నేను ఇచ్చాను. కాని కొన్నేళ్లుగా నేను తెలుసుకున్నాను. కొన్నిసార్లు ప్రేమ ఇతర వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మీరు ఇవ్వడానికి సిద్దంగా ఉండాలని నేను తెలుసుకున్నాను. మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇచ్చాను. నేను ఇప్పుడు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు అది లేదు.
ఆగస్ట్ 8న, నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న రెండు వారాల తర్వాత సమంతా తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఆ తర్వాత మరో పోస్ట్ నవంబర్ 20 న సమంతా పోస్ట్ చేసింది. “మీ విజయాలు అన్నీ ఒక కుప్పగా వేసి… ఆ విజయాలను రిస్క్ చేసి కోల్పోతే… ఆ ఓటమి తర్వాత మీ జీవితాన్ని మళ్లీ ప్రారంభించండి. మీ ఓటమి గురించి ఎప్పుడూ తలుచుకోవద్దు. మీ గుండెను మీ శరీరాన్ని పదిలంగా పెట్టి… మీ వంతు కృషి అందించినప్పుడు… ఇంకా మిమ్మల్ని ఏదో ఇవ్వాలని బలవంతం చేస్తే… నాలో సంకల్పం తప్పా నీకు ఇవ్వడానికి ఏమీ లేదని బలంగా చెప్పండి.
మీరు ప్రజలతో మాట్లాడుతూ… మీ ధర్మాన్ని కాపాడుకోగలిగితే, లేదా రాజులా ముందుకు వెళ్తే… లేదా మీ సాధారణ వ్యక్తిత్వం కోల్పోకుండా ఉంటే శత్రువులు లేదా మీరు ప్రేమించే స్నేహితులు మిమ్మల్ని బాధించకుండా ఉంటే మనుషులందరిలో మిమ్మల్ని ఒకరిగా లెక్కిస్తే… అరవై సెకన్ల విలువైన సమయాన్ని… పరుగుతో మీరు పూర్తి చేసి… మీరు భూమిపై నిలబడితె మీరు మనిషి అవుతారు. భూమి అప్పుడు మిమ్మల్ని తన పుత్రుడిగా భావిస్తుంది.
మీ గురించి మీరు అంతా కోల్పోయి మీపై ఇంకా నిందలు మోపుతున్నప్పుడు మీరు బలంగా నిలబడితే… మనుషులందరూ మిమ్మల్ని అనుమానించినప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసిస్తే వారి సందేహాలను తీర్చడానికి కూడా అవకాశం ఇవ్వండి. మీరు ఆ సమయంలో ఓపికగా వేచి చూసి… అలసిపోకుండా ఉండగలిగితే చాలు. లేదా అబద్ధం చెప్పడం, మోసాలు చేయడం వంటివి చేయవద్దు. అలాగే అసహ్యించుకోవడం, ద్వేషం పెంచుకోవడం వంటివి చేయవద్దు. ఇంకా మంచి వారిగా నటిస్తూ తెలివిగా మాట్లాడకండి.
మీరు కలలు కనగలిగితే మాత్రం కలలను మీ యజమానిగా మార్చుకోవద్దు. మీరు ఆలోచించగలిగితే, ఆ ఆలోచనలను మీ లక్ష్యం చేసుకోకుండా… మీరు విజయాన్ని, ఓటమి ఒకే విధంగా చూడండి. ఆ ఇద్దరు మోసగాళ్ళను ఒకే విధంగా చూడగలిగితే.. మూర్ఖులకు ఉచ్చు బిగించడానికి మీకు అవకాశం దొరుకుతుంది. మీపై కత్తులు ఎక్కుపెట్టినా… వక్రీకరించి మాట్లాడినా సరే… సత్యాన్ని వినడాన్ని మీరు సహిస్తే… మీ జీవితాన్ని మీకు అందించిన వాటితో చూడండి. ఆగిపోయిన దగ్గరే అవకాశాలు ఎదుర్కొంటూ ముందుకు సాగండి.” అంటూ ఒక పోస్ట్ చేసింది.
ఇక తాజాగా… తన కుక్కతో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ… మనుషుల ప్రేమ కంటే సాషా ప్రేమ చాలా గొప్పది అని పోస్ట్ చేసింది. ఇలా సోషల్ మీడియాలో తన మాజీ భర్త నిశ్చితార్ధం, వివాహం తర్వాత సమంతా పలు పోస్ట్ లు చేస్తూ వస్తోంది. ఒకరకంగా ఆమె మాజీ భర్త ఆమెను పూర్తిగా మర్చిపోయాడు అనే విషయం ఆమె గ్రహించడం లేదనేది కూడా అర్ధమవుతోంది. ఆ పెళ్లి ఫోటోలు బహుసా సమంతా చూసి ఉండకపోవచ్చు. చూసి ఉంటే ఈ పోస్ట్ లు చేయకపోవచ్చు. వాళ్ళు పూర్తిగా ఆమెను వదిలేసినా ఆమె మాత్రం వదలలేకపోతోంది. ఒకప్పటి సమంతా నవ్వు ఇప్పుడు కరువైంది. సమంతా నవ్వును ఎంతో ఇష్టపడే ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులు సమంతాలో ఆ స్పార్క్ కనపడటం లేదంటూ బాధ పడుతున్నారు.