Samantha: సామ్‌ను డేటింగ్ చేయమన్న ఫ్యాన్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన సమంత..
హీరోయిన్ సమంత సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లో చిట్ చాట్ కూడా చేస్తుంది.
ఇలా రీసెంట్‌గా చేసిన ఓ చిట్‌చాట్‌లో.. ఓ మహిళా ఫ్యాన్ సమంతకు షాకింగ్ కామెంట్ పెట్టింది. సింగిల్‌గా ఉండటంకంటే ఎవరితో అయినా డేటింగ్ చేయమని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో ఆ మాట అనడం తప్పే కానీ.. మెంటల్‌గా మళ్లీ స్ట్రాంగ్‌గా అయ్యేందుకు డేటింగ్ చేయడంతో తప్పులేదంటూ స్రవంతి సీఎం అనే మహిళ రాసుకొచ్చింది. ఫ్యాన్ పెట్టిన ఈ కామెంట్‌కు సమంత చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. నన్ను మీకంటే ప్రేమించే వాళ్లు ఎవరున్నారు..? ఎవరూ లేరు. ఉంటే ఖచ్చితంగా డేటింగ్ చేసేదాన్ని అంటూ రిప్లై ఇచ్చింది. సామ్ రిప్లై ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
సామ్‌ను పొగుడుతూ ఫ్యాన్స్ అంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. నాగ చైతన్యతో విడాకుల తరువాత తాను చాలా డిప్రెషన్‌కు లోనైనట్టు ఇండైరెక్ట్‌గా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది సమంత. దానికి తోడు మయోసైటిస్ వ్యాధి వల్ల కూడా తాను నరకం చూసినట్టు చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అది చూసి సామ్ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. అలా బాధపడ్డ ఓ అభిమానే సమంత కష్టం చూడలేక డేటింగ్ చేయమని కామెంట్ పెట్టాడు. ఐతే అలాంటి కామెంట్‌ను తప్పుగా అర్థం చేసుకోకుండా మెచూరిటీతో రిప్లై ఇచ్చిన సమంతను ఫ్యాన్ మెచ్చుకుంటున్నారు.
Who will love me like you do 🫶🏻 https://t.co/kTDEaF5xD5
— Samantha (@Samanthaprabhu2) March 26, 2023