నా బతుకు నన్ను బతకనివ్వండి, సమంతా ఫైర్
బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఇప్పుడు సమంతా హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ఆమెకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సమంతా విషయంలో ఎవరు ఏ కామెంట్స్ చేసినా డైవర్స్ తర్వాత ఆమె సినిమాల్లో కమ్ బ్యాక్ ఇచ్చిన విధానం మాత్రం సూపర్ అనే చెప్పాలి.
బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఇప్పుడు సమంతా హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ఆమెకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సమంతా విషయంలో ఎవరు ఏ కామెంట్స్ చేసినా డైవర్స్ తర్వాత ఆమె సినిమాల్లో కమ్ బ్యాక్ ఇచ్చిన విధానం మాత్రం సూపర్ అనే చెప్పాలి. గతంలో చాలా మంది ఈ రేంజ్ లో మెంటల్ టార్చర్ ఎదుర్కొంటే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. కాని సమంతా మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పడానికి ఇష్టపడలేదు. తన కెరీర్ ను మళ్ళీ రీ బిల్డ్ చేసుకుని కష్టపడుతోంది.
ఓ పక్కన మయోసైటిస్ వ్యాధి ఇబ్బంది పెడుతున్నా సరే సమంతా మాత్రం వెనకడుగు వేయడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు సమంతా బాలీవుడ్ లో కూడా బిజీ అవుతోంది. అక్కడ కూడా వరుస ప్రాజెక్ట్ లు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు సమంతాను పెళ్లి చేసుకోమని, కొందరు సింగిల్ గా ఉండమని, పిల్లలను అడాప్ట్ చేసుకోమని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వీటిపై సమంతా ఎప్పటికప్పుడు తన మార్క్ ఆన్సర్ ఇస్తూ వస్తోంది. తాజాగా ఇలాంటి ఆన్సర్ ఇచ్చింది ఓ నెటిజన్ కు.
ఆరోగ్యానికి సంబంధించి కొన్నాళ్ళ క్రితం సమంతా కొన్ని టిప్స్ ఇచ్చింది. దీనిపై పెద్ద వివాదమే రేగిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం కాస్త సంచలనం అయింది. దీనిపై ఓ డాక్టర్ కాస్త అతిగా రియాక్ట్ అయ్యాడు. డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని సోషల్ మీడియాలో కామెంట్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై సమంత రియాక్ట్ అయి… తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని క్లారిటీ కూడా ఇచ్చింది. పలువురు హీరోయిన్లు కూడా సమంతాకు సపోర్ట్ చేసారు.
వివాదం పెద్దది కావడంతో ఆ తర్వాత సమంతకు ఆ డాక్టర్ సారీ కూడా చెప్పేసాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఓ అభిమాని అతిగా రియాక్ట్ అయ్యాడు. సమంత బరువు గురించి ఓ ప్రశ్న వేసాడు. మళ్లీ బరువు పెరగొచ్చు కదా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా దానిపై సమంతా సీరియస్ అయింది. “మళ్ళీ బరువు గురించే ప్రశ్న. నా బరువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి, బతకనివ్వండి అంటూ” సీరియస్ అయింది.