సమంతాకు మరో వ్యాధి, వైరల్ అవుతున్న నిర్మాత కామెంట్స్
బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఇప్పుడు సమంత హాట్ టాపిక్ అవుతుంది. లేటు వయసులో కూడా సినిమా కెరియర్ పై ఫోకస్ పెట్టి మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి చేసిన సీడాటెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది.
బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఇప్పుడు సమంత హాట్ టాపిక్ అవుతుంది. లేటు వయసులో కూడా సినిమా కెరియర్ పై ఫోకస్ పెట్టి మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి చేసిన సీడాటెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. దీనితో సమంత ఫుల్ జోష్ లో ఉంది. మరోసారి తెలుగు సినిమా వైపు కూడా సమంత చూస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్ వైరల్ అవుతుంది. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో సమంత మరోసారి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందంటూ వైరల్ అవుతుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే సమంతకు అడ్వాన్స్ కూడా నిర్మాతలు పే చేసినట్లుగా టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. పుష్ప 2 హిట్ సుక్కు కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడట. ఆ సినిమా కోసం సమంతను ముందే ఫైనల్ చేసి పెట్టుకున్నాడు సుకుమార్. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన సమంత ఆ సినిమాలో ఇద్దరి కాంబినేషన్ బాగుండటంతో మరోసారి రిపీట్ చేసేందుకు సుకుమార్ రెడీ అయ్యాడు.
అటు బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల్లో కూడా ఆఫర్లు కొట్టేస్తోంది సమంత. ఈ టైం లో పర్సనల్ లైఫ్ లో మాత్రం సమంత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రీసెంట్ గా తండ్రిని కోల్పోయింది సామ్. అలాగే గత మూడు నాలుగు ఏళ్ల నుంచి మయోసైటీస్ వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు కూడా దూరమైంది. ఇప్పుడు కాస్త కోలుకొని మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేసింది సమంత. ఈ టైంలో టాలీవుడ్ స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన తొలి సినిమా అల్లుడు శ్రీనులో నటించిన సమయంలో హీరోయిన్ సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆయన చెప్పుకొచ్చాడు. చికిత్సకు సమంతా కు అవసరమైన డబ్బులు నిర్మాతలు ఎవరు ఇవ్వలేదని… తాను 25 లక్షలు ఇచ్చాను అంటూ కామెంట్ చేశాడు. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేవరకు స్టార్ హోటల్ లో ఉంచామని, నాలుగు నెలలకు ఆమె తిరిగి కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్ కోసం రెడీ అయింది అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆ సహాయాన్ని ఆమె మర్చిపోలేదని కొనియాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.