Khushi Movie: సమంత లేకుండానే ఖుషీ ప్రమోషన్

అమెరికాలో ఖుషి ప్రమోషన్స్ చేస్తున్న సమంత.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2023 | 02:55 PMLast Updated on: Aug 27, 2023 | 2:55 PM

Samantha Make Khushi Movie Promotions In America And Social Media

ఖుషీ ఆడియో హిట్‌ అయింది. టీజర్‌ ఆకట్టుకుంది. కానీ.. సినిమా ప్రమోషన్‌కు సమంత లేని లోటు మాత్రం తెలుస్తోంది. మయోసైటిస్‌ ట్రీట్‌మెంట్‌ కోసం సామ్‌ ప్రస్తుతం అమెరికాలో వుంది. సామ్‌ అక్కడ.. విజయ్‌ ఇక్కడ అయిపోయారు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌ టూర్‌ను ఖుషీ ప్రమోషన్‌కు ఉపయోగిస్తోంది సామ్‌. మయోసైటిస్‌ వచ్చిన కొత్తలో సామ్‌ సోషల్‌ మీడియాకు దూరమైపోయింది. బైటకి కనిపించకుండా.. ట్రీట్‌మెంట్‌ తీసుకుని యశోద ప్రమోషన్‌ కోసం.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈసారి అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా.. వార్తల్లో నిలుస్తూనే వుంది. అక్కడ జరిగిన ‘ఇండియా ఇండిపెండెన్స్‌ పెరేడ్‌’లో సందడి చేసింది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్‌ చేస్తోంది. గతంలో మాదిరి ఓన్లీ ట్రీట్‌మెంటే కాకుండా.. ఎంజాయ్‌మెంట్‌ కూడా జోడించింది సామ్‌. సామ్ అమెరికా టూర్‌ ముందే ఫిక్స్‌ కావడం.. మళ్లీ ప్రమోషన్స్‌కు రాదని ముందే తెలిసి మ్యూజిక్‌ కన్సర్ట్‌ను భారీగా ప్లాన్‌ చేశారు.

రౌడీ హీరోతో డ్యాన్స్‌ చేసి..10 ఈవెంట్స్‌ సందడి ఒక్కదానిలోనే చేసింది. ప్రస్తుతం అమెరికాలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా.. అక్కడే ఖుషీని ప్రమోట్‌ చేయనుంది. సినిమా పాన్‌ ఇండియాగా రిలీజ్‌కావడంతో.. విజయ్‌ కర్నాటక, తమిళనాడు.. కేరళ..ముంబాయ్‌ చుట్టేసే పని స్టార్ట్‌ చేశాడు. ఖుషీకి అమెరికాలో మంచి హైప్‌ వుండడంతో.. సామ్‌ త్వరలో ప్రమోషన్‌ స్టార్ట్‌ చేస్తుందట.
సాధారణంగా మన హీరోలు ఓవరన్సీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొనడం చాలా తక్కువ. ఖుషీ ఇండియా ప్రమోషన్‌కు సామ్‌ దూరమైనా.. అమెరికా ఈవెంట్స్‌లో పాల్గొంటూ.. హైప్‌ తీసుకురానుంది. సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ అవుతోంది. వరుస ఫ్లాపుల్లో వున్న హీరోహీరోయిన్లే కాదు.. దర్శకుడు శివ నిర్వాణ.. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఖుషీ సక్సెస్‌ చాలా అవసరం.