చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్‌పై.. సమంత సంచలన పోస్ట్..
అక్కినేని వారసుడు నాగచైతన్య ఎంగేజ్‌మెంట్.. నటి శోభితతో సింపుల్‌గా జరిగింది. ట్రిపుల్ 8 అని ట్యాగ్ పెట్టిన నాగార్జున.. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు రివీల్ చేశాడు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా.. ఈ జంటకు విషెస్ చెప్తున్నారు. నిజానికి కొంత కాలంగా.. నాగచైతన్య, శోభిత డేటింగ్ వ్యవహారంపై రకరకాల గాసిప్స్ వినిపించాయ్. అవి కాస్త ఎట్టకేలకు నిజం అయ్యాయ్. ఆ మధ్య ఇద్దరు కలిసి ఒకే హోటల్‌లో ఉన్న ఫొటోల కూడా వైరల్ అయ్యాయ్. ఐతే నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌పై.. సమంత ఎలా రియాక్ట్ అవుతుందా అని రియాక్ట్ అవుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఐతే నిజానికి.. ఎంగేజ్‌మెంట్‌కు ముందే.. చైతూకు పంచ్ పడేలా సమంత ఓ పోస్ట్ పెట్టిందంటూ కొత్తప్రచారం జోరుగా సాగుతోది.
చైతూతో బ్రేకర్ తర్వాత.. సమంత తన స్టైల్‌లో లైఫ్ లీడ్ చేస్తోంది. డివోర్స తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా.. ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన రకరకాల రూమర్లు ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. చైతూ, శోభితా ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందే.. సమంత ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్లు.. ఎప్పుడూ కూడా ఒంటరివాళ్లు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ పోస్టులో రాసుకొచ్చింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను… ఎదుర్కొన్న వాళ్లను పైనుంచి ఓ శక్తి కాపాడుతుంటుందని.. ఎల్లప్పుడు ఆ శక్తి చుట్టూ రక్షణగా ఉంటుందని.. అలాంటి సమయంలో మానసిక స్థైర్యం చాలా గొప్పదని… నీకు ఎప్పుడూ మేమంత అండగా ఉంటాం అంటూ వినేశ్ పోగట్ గురించి సమంత ఓ పోస్ట్ పెట్టింది. ఐతే ఇది కేవలం వినీష్ కోసమే కాదని.. తన లైఫ్‌ను కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా సమంత పోస్టు చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఫోగట్ గురించి సమంత రాసిన ప్రతీ మాట.. ఆమె లైఫ్‌లానే అనిపిస్తుందని.. కంపేర్ చేసి మరీ పాత పోస్టును షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంగేజ్‌మెంట్ గురించి ముందు తెలిసే.. ఇండైరెక్ట్‌గా ఇలాంటి పోస్ట్ పెట్టిందంటూ షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇక అటు సమతం ప్రస్తుతం సిటాడెల్‌లో యాక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.