నేను ఒంటరిని కాదు సురేఖ: సమంతా రియాక్షన్
ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత మరోసారి స్పందించారు. తన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్ని ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన సమంతను... ఇటీవల చర్చనీయాంశమైన కొండా సురేఖ వ్యాఖ్యలు గురించి ప్రశ్నించగా... ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతు కారణం అన్నారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత మరోసారి స్పందించారు. తన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్ని ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన సమంతను… ఇటీవల చర్చనీయాంశమైన కొండా సురేఖ వ్యాఖ్యలు గురించి ప్రశ్నించగా… ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతు కారణం అన్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు.
వారు నాలో ధైర్యం నింపారు… కష్టాలను ఎదుర్కోవడంలో వారి మద్దతు నాకెంతో సాయపడిందని తెలిపారు. వారు నా పక్షాన నిలవకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేదన్నారు. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగాను అని సమంత వివరించారు.