Samantha: మయోసైటిస్ చికిత్సకు సాయంపై స్పందించిన సమంత
సమంతా ఈమె చేయని సినిమాలేదు.. ఇవ్వని ఎక్స్ ప్రెషన్ లేదు. అన్నీ అనతి కాలంలోనే చేసేసి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. తాజాగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ తన సినిమా కెరిర్ కి కాస్త ఇంటర్ బెల్ ఇచ్చారు. ఈ బ్రేక్ లోనూ కొందరు ఈమెపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. తగిలిన గాయంపై కారంపొడి చల్లినట్లు ఈ వార్తను మరింత మంటెత్తేలా విషప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించారు నటి సమంత.

Samantha responded to Star Hero's 25 crore donation for the treatment of myositis
గతంలో నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత చాలా వరకూ డిప్రెషన్లో వెళ్లిపోయారు. దీనిని అధిగమించి శారీరక దృఢత్వం పొందడం కోసం ఫిట్ నెస్ పై దృష్టి కేంద్రీకరించారు. ఆతరువాత మానసిక ప్రశాంతతకై ఆధ్యాత్మిక పర్యటనలు, ఆహ్లాదకరమైన పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖుషీ సినిమాలో విజయ్ దేవర కొండ సరసన మెరిసారు. సిటాడెల్ అనే చిత్రంలో నటిస్తూ మధ్యలో ఈ వ్యధికారణంగా కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
ఇలాంటి నేపధ్యంలో తన మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం ఒక స్టార్ హీరో వద్ద నుంచి రూ. 25 కోట్లు ఆర్థికసాయం అందుకుందని వార్తలు వచ్చాయి. దీనిపై తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు సమంత. మయోసైటిస్ చికిత్సకు రూ. 25 కోట్లా.. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇంత మొత్తంలో చాలా తక్కువ భాగం మాత్రమే తనకు ఖర్చు అయినట్లు క్లారిటీ ఇచ్చారు. అయినా నేను జీతం తీసుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను సులభంగా చూసుకోగలను అని సున్నితంగా చురకలంటించారు. దీంతో పాటూ మయోసైటిస్ తో వేలాది మంది బాధపడుతున్నారని గుర్తుచేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
T.V.SRIKAR