Samantha Ruth Prabhu: నేను చేసిన పెద్ద తప్పు అదే.. చైతూ, పెళ్లిపై సమంత సంచలనం
సోషల్ మీడియాలో ప్రతీ విషయాన్ని పంచుకుంటోంది సామ్. సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది.

Samantha Ruth Prabhu: సమంత.. తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ ఓన్ చేసుకున్న హీరోయిన్. సామ్ గురించి ఏ చిన్న విషయమైనా తెగ వైరల్ అయ్యేది అందుకే..! నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది. ట్రీట్‌మెంట్ నుంచి డెయిలీ లైఫ్ రొటీన్స్ వరకు.. సోషల్ మీడియాలో ప్రతీ విషయాన్ని పంచుకుంటోంది సామ్. సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.
Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?
తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా.. అభిమానులతో చిట్‌చాట్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది సమంత. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటో కూడా చెప్పింది. తన ఇష్టాయిష్టాలను గుర్తించడంతో ఫెయిల్ అయ్యానని.. అదే తాను చేసిన పెద్ద తప్పు అని సమంత చెప్పుకొచ్చింది. ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకునేందుకు చాలా సమయం పట్టిందని.. గతంలో తన జీవిత భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడని.. కష్టకాలం నుంచి విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైన తర్వాతే.. పర్సనల్‌గా తన ఎదుగుదల మొదలైంది అంటూ సమంత ఆన్సర్ ఇచ్చింది. నాగచైతన్యతో విడాకుల గురించి చెప్పకనే చెప్పిందా సామ్ అనే చర్చ మొదలైంది. సమంత ఆలోచనలకు చైతూ విలువ ఇచ్చేవాడు కాదా.. అందుకే విడాకుల వరకు వెళ్లిందా అనే డిస్కషన్ నడుస్తోంది.
ఏమైనా సమంత కొత్త ఆన్సర్.. ఇప్పుడు సరికొత్త చర్చకు కారణం అుతోంది. చైతూతో విడాకుల తర్వాత.. వరుస ఫ్లాపులు రావడం.. ఆరోగ్య సమస్యలతో మానసికంగా కుంగిపోయానని సామ్ చెప్పిన మాటలతో అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2017లో చైతూ, సామ్ లవ్ మ్యారేజీ చేసుకున్నారు. నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట.. 2021లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కెరీర్ పరంగా బిజీ అయ్యారు.